లక్ష్మీ స్తుతి;-అద్దంకి లక్ష్మి-- ముంబై
ఇష్ట పదులు

1
శ్రీమన్నారాయణు శ్రీదేవి నీవమ్మ
పాలసంద్రము పుట్టె భాగ్య సంపద లొసగ

చంద్ర సహోదరివీ చతుర్భుజ శ్రీలక్ష్మి
 శంఖ చక్రము ధరించి సకల శుభము లీయవె

పద్మాసనములోన పద్మమాల ధరించి
 చిరు నగవులొలికించు శ్రీలక్ష్మి నీవమ్మ

కల్పతరువై నీవు కాపాడు మాయమ్మ
 భవభయ హారిణివీ పాప విమోచనివీ

2
మునిగణము సేవించు మోక్ష  ప్రదాయినివి
 ఆదిలక్ష్మి నీవమ్మ అష్టైశ్వర్య మీయ

శుక్రవారపు పూజలు శుభములు కలిగించును
  వరలక్ష్మి పూజింప వరము లొసగవె తల్లి

విజయాలు చేకూర్చ విజయలక్ష్మి వమ్మా
 సంతాన లక్ష్మివీ
సకల శుభములేయవె

కనకధార స్తోత్రము కాసులను కురిపించె
 శ్రీ శంకరాచార్య శ్రీలక్ష్మి స్తోత్రము

కామెంట్‌లు