మాయలోకం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
జననమే మాయ
జీవితమే మాయ
జగతియే మాయ

మాయలోకం
బంధాలలో ఇరికిస్తుంది
బ్రతుకంతా ఈదిస్తుంది

మాయలోకం
సుఖాలను చూపిస్తుంది
దుఃఖాల పాలుజేస్తుంది

మాయలోకం
ఆశలు కలిగిస్తుంది
అగచాట్లు పెడుతుంది

మాయలోకం
చిక్కితే పట్టుకుంటుంది
చిరకాలం పీడిస్తుంది

మాయలోకం
సంసారంలో దించుతుంది
సాగరంలో ముంచుతుంది

మాయలోకం
భ్రమలు కల్పిస్తుంది
భ్రాంతిలో పడవేస్తుంది

మాయలోకం
ఆకాశానికి ఎగరమంటుంది
అధోలోకంలో పడవేస్తుంది

మాయలోకం
మనసుల బంధిస్తుంది
మేనుల బాధిస్తుంది

మాయలోకం
ఏమిస్తావంటుంది
ఏమికావాలనడగకుంటది

మాయలోకం
మాటలను వక్రీకరిస్తుంది
అపార్ధాలను అంటకడుతుంది

మాయలోకం
అందంగావుంటే అసూయపడుతుంది
ఆనందంగావుంటే ఆటపట్టిస్తుంది

మాయలోకం
గెలిస్తే అభినందించకుంటుంది
పొగడటానికి నోరుతెరవకుంటుంది

మాయలోకం
బంధాలలో చిక్కించుకుంటుంది
బయట పడనీయకుంటుంది

మానవుడా జాగ్రత్త!
ఆలోచించు
అర్ధంచేసుకో

మాయపాలిట పడకు
మాయమాటలు నమ్మకు
మాయలో కొట్టుకుపోకు

దేహమే మాయ
దాంపత్యమే మాయ
దేవుడే మాయకామెంట్‌లు