పాలెం గ్రామంలో రమేష్, రమ్య అనే ఇద్దరు పేద దంపతులు నివసిస్తున్నారు. వారు ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. వారి గుడిసె పక్కనే ఒక పెద్ద మేడ ఉండేది. ఆ మేడలో శ్రవణ్, శ్రావ్య అనే ధనవంతులైన దంపతులు నివసిస్తున్నారు. రమేష్, రమ్య దంపతులు ఎవరు ఆపదలో ఉన్నా తమకు తోచిన సహాయం చేసే వాళ్ళు. శ్రవణ్, శ్రావ్య మాత్రం ఎవ్వరికీ కొంచమైన సహాయం చేసేవారు కాదు. పిసినారి వాళ్లు అని పేరు పొందారు.;-
ఒకరోజు పాలెం గ్రామానికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆయనకు చాలా మహిమలు ఉన్నాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. స్వామీజీ భిక్ష కోసం శ్రవణ్, శ్రావ్య మేడ ముందుకు వెళ్లాడు. శ్రావ్య బయటకు వచ్చి 'అబ్బో నీకు ఏమైంది ఏదో పని చేసుకుని బతుకు వచ్చు కదా. బిక్ష లేదు ఏమి లేదు వెళ్ళు' అని కసిరింది. స్వామీజీ అక్కడినుండి మౌనంగా రమ్య రమేష్ వాళ్ల గుడిసె ముందుకు వెళ్లాడు. రమ్య చేటలో బియ్యం తీసుకుని వచ్చి స్వామీజీ సంచిలో పోసి కాళ్లకు నమస్కరించి ఆశీర్వదించమని కోరింది. స్వామీజీ ఆశీర్వదించాడు. ఆశ్చర్యంగా రమ్య వాళ్ళ గుడిసె ఒక్కసారిగా పెద్ద భవనంగా మారిపోయింది. అదే సమయంలో శ్రవణ్ వాళ్ళ భవనం చిన్న గుడిసె లాగా మారిపోయింది. రమ్య ఆశ్చర్యపోయి స్వామీజీ పాదాలకు మరొకసారి నమస్కరించి మాకు కష్టపడకుండా వచ్చిన ఇటువంటి భవనాలు వద్దు స్వామి. మా గుడిసె మాకు చాలు. మేము సుఖంగా ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించండి అని వినయంగా కోరింది. రమ్య నిజాయితీకి స్వామీజీ ఎంతో సంతోషించాడు. అలాగే ఆశీర్వదించాడు. భవనం గుడిసెగా మారిపోయిన శ్రవణ్, శ్రావ్య లబోదిబో మనుకుంటూ స్వామి ముందుకు వచ్చారు. క్షమించమని వేడుకున్నారు. రమ్య గూడ వాళ్లను క్షమించండి అని అడిగింది. ఇప్పటినుండి బుద్దిగా ఉండండి. పరోపకారంతో జీవించండి అని చెప్పి స్వామీజీ శ్రవణ్ వాళ్లకు మళ్ళీ భవనం వచ్చేలాగా చేశాడు. శ్రవణ్ శ్రావ్య తమ తప్పును తెలుసుకొని అప్పటినుండి అందరికీ సహాయం చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి