ఆహ్వానం!!; -ప్రతాప్ కౌటిళ్యా
తొలికోడి కూసింది
సప్త స్వరాలు
ఏరుకుంటున్నారు!!

తొలి కిరణం పూసింది
ఏడు రంగులు
కోరుకుంటున్నారు!!

ఉరుములు మెరుపులతో
మేఘాలన్నీ కురుస్తుంటే
సప్త సముద్రాలు ఏకమవుతున్నవీ!!

ఎండా వాన గొడుగు కిందికి
ఖండాలన్నీ
కలిసి వస్తున్నాయి!!

కాలం ఒక నిర్ణయం తీసుకుంది
చీకటితో నడిచే వాళ్ళ వెంట కాదు
వెలుగుతో నడిచే వాళ్ళ వెంట ఉండాలని!!

పాడిపంటలు పరిశ్రమలు
పని శ్రమతో నడుస్తున్నాయి!!

కార్మికుడు కర్షకుడు సైనికుడు
దేశ కడుపులో
పొద్దుపొడుపై ఉదయిస్తున్నాడు!!

నీరు నిప్పు బద్ధ శత్రువులు
వాళ్ళిద్దరూ మనకు మిత్రులు
వాటి పంపక విధివిధానాలే
మన గొప్ప నిధులు!!

కాలం కఠిన నిర్ణయం తీసుకుంది

గద్దెనెక్కేకన్న ముందు యుద్ధం కాదు
ఉచిత విద్య వైద్యం ఆహార భద్రత కై
గద్దె సిద్ధమైంది!!?

భారతీయ రాష్ట్రీయ సమితికి ఆహ్వానం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు