గోపాల బాల ;-ఎం. వి. ఉమాదేవి.
మధురకేగి చల్ల మనమమ్మి వద్దుము 
రార గోపికృష్ణ రమ్యముగను 
వాడలోని చెలులు వా దున కొచ్చేరు 
పలుకబోకుమయ్య పడుచువాడ!!

కనకపుష్యరాగ కంఠహార మునొసంగి
పట్టుచేలమిచ్చి గట్టిగాను 
వెంటబెట్టుకొనుచు వేణువు నూదగా 
పాలునొలికి పోయెపట్టుదప్పి !!


కామెంట్‌లు