ఏది అందం?;-- యామిజాల జగదీశ్
 అందం...
అందమైనవారిని మనమందరం ఆస్వాదిస్తాం. ఆదరిస్తాం. అభిమానిస్తాం.
అందంగా ఉండటానికి ఆశ పడతాం.
అందంగా లేరనే ఏకైక కారణంతో 
పలువురిని దూరంగా ఉంచుతాం.
అందంగా లేమనే కారణంగా మనల్ని దూరం ఉంచితే మనంవాడిపోతాం.
ఏది అందం?
తెలుపా
ఎరుపా సూటియైన ముక్కా
దేహదారుఢ్యమా
రంగు రంగుల దుస్తులా?
శిఖలా
ఖరీదైన ఆభరణాలా
ఇవన్నీ అందాలే
అయితే ఇవి మాత్రమే అందాలు కావు.
పిల్లల్ని ప్రేమతో ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని కంటికి రెప్పలా పెంచే కన్న తల్లిదండ్రులు అందం.
ఆ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వినయవిధేయతలతో చూసుకోవడం అందం
భార్యను తక్కువ చేయకుండా చూసుకునే భర్త అందం.
భర్తను ఏ కారణంగానూ వదులుకోని భార్య అందం.
స్త్రీలను హుందాంగా చూసుకుని గౌరవించే మగాళ్ళు అందం.
మంచి నడత నడక అందం
చేసే పనిని శ్రద్ధగా సమర్థతతో చేయడం అందం.
నీతినిజాయితీలకు ప్రాధాన్యమిస్తూ నడచుకోవడం అందం
ఎదుటి వారి మనసుని నొప్పించక మాటాడటం అందం
ఇతరులను ప్రోత్సహిస్తూ మాటలు చెప్పి భుజం తట్టడం అందం
రహదారులపై జాగర్తగా బాధ్యతతో వాహనాలు నడిపేవారు అందం
సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకునే కళ్ళందం. వారి కష్టానికి భరోసా ఇవ్వడం అందం.
సమాజ శ్రేయస్సుకి తన వంతు శ్రమించే వారందం.
వినయంతో అణకువతో వ్యవహరించే వారూ అందం.
వికసిత మోము 
మంచి మాట
ఎప్పుడూ అందం
ఇన్ని రకాలను అనుసరిస్తే ప్రతి ఒక్కరూ అందమే

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం