ఆహా... కాలమహిమ... !(* చిత్రకవిత *-- కోరాడ నరసింహా రావు.
గొడ్డళ్లతో నరికినా... 
 రంపాలతో కోసినా... 
  మేకులేసి దిగ్గొట్టినా.... 
   పరోపకారిగానే......,          తరువుజన్మధన్యం....!
   కర్రచెక్కలకు...ముక్కలకు  
  అందమైన ఆకృతులనిచ్చి 
   నగిషీలతో... ఆకర్షణ పెంచి 
    గృహోప కరణాలుగా.... 
    వన్నెతెచ్చిన కఱ్ఱపనివారి ప్రావీణ్యత.... ప్రశంసనీయము 
    చేతి వృత్తులతో.... పేరు, ప్రఖ్యాతి, జీవనోపాధి.... !
   యాంత్రిక యుగ తంత్రం.... 
   చేసేసిందికదా.... ఆ సంస్కృతిని ఛిద్రం..... !
  ఆహా... కాలమహిమ... !!
     ******

కామెంట్‌లు