సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  ద్రష్ట...స్రష్ట
     *****
ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ ద్రష్టగా  వీక్షిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి.
వీటన్నింటినీ తనదైన అంతర్నేత్రంతో  చూస్తూ ఉండేవారు,  లోకంలోని జీవుల సంతోషాలు,సంవేదనలను చూడగలుగుతూ,సమాజ హితైషులుగా ఉండేవారు కొందరు ఉంటారు.
అలా తమ మనోబలం, తపోబలం చేత సామాన్యులు చూడలేని  విషయాలను చూడగలిగిన వారిని ద్రష్ట అంటారు.
అలాంటి ద్రష్టకు ఏమేమి అర్థాలున్నాయో చూద్దాం... ప్రేక్షకుడు,చూపఱు(రు),ప్రేక్షణికుడు,ప్రేక్షి,సమాజికుడు,సామాజికుడు, సౌమేధికుడు,సభికుడు, సాధువు,ఋషి, సహృదయుడు, మంచివాడు ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
మనుషులుగా మనం ద్రష్టలుగానే కాకుండా స్రష్టలుగా  కూడా ఉండాలి. అప్పుడే ఓ అందమైన అద్భుతమైన లోకం ఆవిష్కృతం అవుతుంది.
ఈ లోకం ఎందరో స్రష్టల నిలయం. స్రష్టలుగా ఎన్నింటినో సృజించి, ఎన్నెన్నో సౌకర్యాలతో జీవిస్తున్నారు నేటి మానవులు.
 స్రష్ట అంటే ముఖ్యంగా నిర్మించే లేక తయారు చేసే వ్యక్తి. స్రష్టకు మరెన్నో అర్థాలు ఉన్నాయి అవి ఏమిటంటే...బ్రహ్మ,ధాత,ధారణుడు,విధాత,విరించి, సర్వతోముఖుడు,జగత్కర్త, సృష్టి కర్త,జగత్ నిర్మాత, సృజన కర్త,సృజనకారి.... ఇలా స్రష్టకు అనేక పర్యాయాలు,నానార్థాలు కూడా ఉన్నాయి.
ద్రష్టగా సమాజాన్ని, ప్రపంచాన్ని నిశితంగా వీక్షిద్దాం. స్రష్టగా నూతన ఆవిష్కరణలు చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం