పండగండి పండగ; బెహరా ఉమా మహేశ్వర రావు ,
పండగండి పండగ
కొండల్లో పండగ
గిరిజనుల్లో పండగ
ఆనందాల పండగ
     సంక్రాంతికి ధీటైనా పండగ
     ప్రకృతి దేవత పండగ
     అడవి తల్లిదీ పండగ
     కందికొత్తల పండగ
కందిపంట తగు పండిన
ఇల్లంతా కందులు నిండిన
ముట్టనైన ముట్టరంట
నోటిన గింజ పెట్టారంట
      జన్నోడు, దీశ రోడు, యజ్జోడు
      ముగ్గురు ముఖ్య పూజారులు,
        కొత్త కందుల పూజలు చేసి
        నివేదన పెడితేనే తింటారు
గిరిజన భామల నాట్యాలు
ఆటపాటల పలు వినోదాలు
ప్రాచీన గిరిజనం సంస్కృతులు
విభిన్న జాతి సాంప్రదాయాలు
    అడవిలోని జంతు భయం
    విష సర్పాల కాటు  విషం
    తొలగించవే మహా తల్లి!
    కరుణించవే మా తల్లి!!
కొండగూటిలో ఐదు రోజులు 
అడవి తల్లికి జరిగే పూజలు
చివరిరోజు  కలిసిమెలిసి తినే
సహపంక్తి భోజనాలు చేస్తారు
    తరతరాల ఈ పండుగ
    గొప్పదైనది ఈ పండుగ
    ప్రకృతి ఒడిలో  పండుగ
    వినూత్నమైన సందడిగ

కామెంట్‌లు