సుప్రభాత కవిత ; -బృంద
నీలాల నింగి మధనంలో
జ్యోతికలశం ప్రభవించింది.
నేలంతా వెలుగులు
పండుగలా ప్రసరించాయి

జీవన సంద్రంలో మనకు
ప్రతిక్షణమూ మధనమే!

కొత్త ఆనందాలు కొత్త అవకాశాలు
మనమే సాధించుకోవాలి.

ఆశించే స్థాయి నుండీ
శాసించే స్థాయికి....ఎదగాలి

అవమానించిన వారితో
సన్మానం చేయించుకోవాలి

తిరస్కారాలు  దొరికిన చోటే
పురస్కారాలు పొందాలి.

ఆదరించాలి అందరినీ
కానీ అలుసివ్వకూడదు

అందరు చెప్పేది తప్పక వినాలి
మనకు మంచి 
అనిపించిందే చేయాలి

కలిగిన అనుభవాలన్నీ
పాఠ్యాంశాలే బ్రతుకు పరీక్షలో!
నిర్లిప్తత  వీడి నిర్ణయం
వేపు నడవాలి.

హాలాహలం  వచ్చిందని
ప్రయత్నం ఆపితే అమృతం
వచ్చేనా??
ఆనందం తెచ్చేనా?

చీకట్లు కమ్ముకున్నాయని
భయపడితూ కూచుంటే...
వెలుగు రాక మానేనా??
వెతలు తీరక పోయేనా?

నవ నవోదయ వేళ
నూతనోత్సాహం తెచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు