తాజా గజల్(ఫాయిలున్)హస్న్ ఏ మత్లా;-ఎం. వి. ఉమాదేవి
ఏమిటీ జీవితం హాయిగా సాగదే 
రోజులే భారమై మంచిగా సాగదే

ప్రేమనే పంచినా సాఫిగా సాగదే
యోగమే ఉందనే  రీతిగా సాగదే  

చిక్కనౌ చీకటే కమ్మెనే గుండెలో 
చంద్రికే వాలినా  కాంతిగా సాగదే

సుందరం వేషమే సంశయం భావమే 
విభ్రమం కాలమే నీతిగా సాగదే

భారతం గొప్ప

దే ధర్మమౌ సత్యమే  
విశ్వమే మెచ్చునే జాతిగా సాగదే 

మిత్రులో శత్రులో సర్వులూ ఇష్టులే 
క్రుంగినా పొంగినా పోటిగా సాగదే

నీవునా చెంతనే ఉండిపో నేస్తమా 
తోడుగా భావియే మేటిగా సాగదే !!  

కామెంట్‌లు