బాపు కూతుళ్లు!!-- ప్రతాప్ కౌటిళ్యా
తులసీదళంలో
ఒకరు శ్రీదేవి
మరొకరు సరస్వతి!!
ఇక్కడ
బ్రహ్మ విష్ణువులు
వారికి బాపూలు!!

బంగారు తెలంగాణలో
ఐరావతం
కామధేనువులు
ఒకరు శ్రీదేవి!!
మరొకరు కవిత!!

నాలుక పైనుంచి జారే
నాయాగరా జలపాతం
ఒక కాళికా ఆమె కవిత!!

హిమాలయ గుండెల్లో పుట్టిన
శ్రీగంధం గంగానది
ఆమె మంత్రి శ్రీదేవి!!

నక్షత్రాలన్నీ కోసి
పూలు చేసి
మేఘాలన్నీ కలిపి
సరిగమల సంగీతం కురిపించి

ఉరుములు మెరుపులను
కనురెప్పల చాటున దాచి

పగలు రాత్రులను
పెదవి దాటిన మాటలు చేసి
తెలంగాణ గొంతుల్లో
గాయత్రీ మంత్రమైన
మహిళలు వారు!!!

తీగలకు కాసిన నీటి కాయలు
తేనేటిగలు సృష్టించిన
తీయని తెలుగు తేనెలు
రక్తాన్ని పాలామృతం చేసి
తెలంగాణ పసిపాపకు
కడుపు నింపిన అమ్మలు
వీర వనితలు వారు!!!

అబద్ధాలు చెప్పడం
నీడలు సృష్టించడం
అద్దానికి రాదు!!? కానీ
మనల్ని సృష్టించిన అమ్మ
నిత్యం యుద్ధం చేస్తుంది!!

కొమ్మల పై వాలే పక్షులకు
నమ్మకం కొమ్మ కాదు రెక్కలు!!
ఆకాశంలో ఎగిరే డేగలకు
రెక్కల కన్న కన్నులే కీలకం!!

కడుపులో ఎముకల్ని తయారుచేసి
మెదడును సృష్టించిన అమ్మలకు
తెలివితేటలే కాదు
ఆటలు ఓ లెక్క కాదు!!

అడవిని సృష్టించిన భూమి
పులి సింహాలను పెంచి పోషించింది
ఎవరూ రాజ్యం దాటలేదు!!

దమ్మున్న అడవి పిల్లలు వాళ్లు
అడవిలో మొదటి వేటగాళ్లు అమ్మలే!!

మీరు వేలయేళ్ళుగా భూమిని
కాళ్ల కిందనే తొక్కి పెట్టారు!!
మీరు ఇప్పుడు దేవతలైతే
భూమిపై కాళ్లు మోపక మీరు మేము
గాల్లో తేలుతారని విన్నాము
అంటున్న ఆడపిల్లలు వాళ్ళు!!

ఒక్క నీటి బొట్టుతో ఆకాశంలో
ఇంద్రధనస్సు పుట్టినట్లు
తెలంగాణ నుదుట పుట్టిన
తిలకం బొట్టులు శ్రీదేవి కవితలు!!

కాళ్ళు చేతులు వాడిన
మొదటి వాళ్లు వాళ్లు!!
కళ్ళు చెవుల నోళ్ళు మూయించిన
మెదళ్లు వాళ్లు!!
బాపు ఇద్దరు కూతుళ్లు వాళ్ళు!!

మంత్రి శ్రీదేవి కవితల గార్లకు అంకితం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏🙏
8309529273

కామెంట్‌లు