సుప్రభాత కవిత ; -బృంద
తిమిరాన్ని తరిమేస్తూ
కురిసేటి  వెలుగులు
చిలికించు  అమృతాలు
పులకించు భువనాలు

మౌనంగా నిదురించు
లోయలన్నీ ప్రతిధ్వనించు 
నిశ్శబ్దాలు

కలవరాలు కరిగిపోయి
కలవరించు కలలన్నీ
కమ్మగా కనులకు  విందులు

మోసుకొచ్చు మురిపాల
మూటలోని  తెలియరాని
ముచ్చట్లు

పులకరించు పుడమితల్లిని
పలకరించి  కుశలమడిగి 
చిరునవ్వుల సంతకాలు

ఉప్పెనంటి ఊహలతో
ఉదయానికై ఎదురుచూసే
ఉరికేటి ఉత్సాహాలు...

తేరిపార చూడలేని
సూదిగుచ్చు కిరణాల
మేఘాలతేరులో విహారాలు

జగతికి సుగతిని నిర్దేశింప
అలుపులేక అలసిపోక
ఆగమించు ఆప్తమిత్రునికి


🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు