పిల్లలం-మల్లెలం;--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
విరిసి విరియని మల్లెలం
అల్లరి చేయు పిల్లలం
తొలకరి వాన జల్లులం
అందాల హరివిల్లులం

ప్రగతికి మేము బాటలం
తావులీనే తోటలం
జీవజలముల ఊటలం
గృహమున ప్రేమ కోటలం

భారతమ్మకు పుత్రులం
చెలిమిని పంచు మిత్రులం
ఇంటి కొమ్మకు ఫలములం
మింటిని వెలుగు తారలం

మేముంటేనే లోకం
మేమున్న చోట నాకం
మేములేనిచో శోకం
తాండవించును శూన్యం


కామెంట్‌లు