అపురూపమైన బాల్యం
ఆటపాటల సరదాల బాల్యం
విద్యని నేర్వాల్సిన బాల్యం
విజ్ఞానం అందుకోవాల్సిన బాల్యం .
గోరుముద్దలు తింటు ఒత్తిడులు
మరచి అమ్మ ఒడిలో నాన్న చేయిపట్టి
బుడతడు కలతలు కల్మషం ఎరుగని
మధురస్మృతులతో గడవాల్సిన బాల్యం...
కాని ఇంటిపరిస్థితులు తల్లిదండ్రుల
బాధ్యతలు ఇంటిల్లిపాది కష్టించి
పనిచేస్తేగాని ఆ పూట గడవదని జానెడు
పొట్ట కోసం తప్పని రోజు చేసే పోరాటం...
ఆ చిట్టి హృదయం గుండెలో ఎంతగా
రోదించిందో కనిపించని ఆవేదనతో
కష్టాలని ఇష్టాలుగా మలచుకొని
చిన్నచిన్న పనుల్లోమౌనంగా నిమగ్నమై ...
తనవంతు చేదోడుగా తనని కన్నవారి
సంతోషం కోసం చిట్టిచేతులతో ఆమ్ముతు
కొనేవారు రాకపోతార అని అమాయక
వదనంతో చూసే ఎదురుచూపులు......
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి