చెట్టు
ఆకులపై రేఖలు రాసుకుంటుంది!
లోలోపల
వలయాలు నేర్చుకుంటుంది!!
మనిషి
చేతులపై రేఖలు చదువుకుంటున్నాడు
నుదుటిపై
రాతలు రాసుకుంటున్నాడు!!
నదీ
ముక్కలు ముక్కలుగా విడిపోయిన
సజీవంగా జీవిస్తూనే ఉంది!!?
ఎండమావులు
గుండెలు చించుకొని
తమను తాము పేల్చుకుంటూ
మన కండ్లకు కనిపించకుండా
పారిపోతున్నవి!!
గాలి
తన చుట్టూ తాను సుడులు తిరిగి
తలకు ఉరిబిగించుకొని
ఆత్మహత్య చేసుకుంటుంది!!
రాత్రి నీ బెదిరిస్తున్న
గుడ్లగూబ
పగలు నిద్రను మింగేస్తూ ఆకలితో
కదలకుండానే కాలం చేసింది!!?
ఎడారిలో బ్రహ్మజెముడు
తొలిసారి నదుల వెంట పెరగాలని
నిర్ణయించుకుంది కానీ
నదులన్నీ మరణించినట్లు ఎడారి
తెల్లవారుజామున
ఏడ్చుకుంటూ కూర్చుంది!!
నిలబడితే చెట్టులా
ఒంటరిగానే నిలబడాలి కానీ
చెట్టు అడవిని సృష్టిస్తుంది!!
ఓడిపోతే పడిపోవాలి
నేలపై విత్తనంలా కానీ
మళ్లీ మొలకెత్తి గెలవాలి!!
ఏదీ శాశ్వతం కాదు బ్రతుకు మరణించు
కానీ శాశ్వత మార్గాలు వెతుక్కుంటూ
శాశ్వతదారులు నిర్మిస్తూనే వెళ్లాలి!!?
ఆకలి కై అడవిని అడవిలోని జంతువులను
మనిషి తినేస్తున్నట్లు
కనపడితే దేవుని కూడా
ప్రపంచం చంపేస్తుంది!!?
మగవాళ్లు ఆడవాళ్లను ప్రేమించినట్లు
ఆడవాళ్లు మగవాళ్ళను ప్రేమించినట్లు
మనుషులు భూగోళాన్ని ప్రేమించాలి
ప్రకృతిని రక్షించుకోవాలి!!
అద్దాలు పగిలినట్లు
పొద్దులు పగిలిపోతున్నవి!!
ఆడ మగాళ్ళ మధ్య
హద్దులన్నీ కిరణాల్లా
చిట్లిపోతున్నవి!!
చీకటి ఒంటరిదై
అగ్గిపుల్లను చూసి భయపడుతుంది!!
దీపం ఆయుషు క్షీణించిన
దేహాన్ని దహించుకొని వెలుగుతుంది!!
భూమిపై ఎనిమిది వందల కోట్ల
రక్త మాంసాలతో నిర్మించబడిన
దేవాలయాలం మనం!!
మనం నడుస్తున్న దేహాలు కాదు!
మనం నడుస్తున్న దేవాలయాలం!!
అధికార భాషా సంఘం అధ్యక్షురాలు
మంత్రి శ్రీదేవి గారికి అంకితం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి