సరి కొత్త సంవత్సరానికి
కొత్త ఉత్సాహపు వేడుకలను
కొత్త పసందైన విందులతో
సరి కొత్తగా స్వాగతం పలుకు దామా
కొత్త ఆలోచనలను పంచుతూ
కొత్త ప్రణాళికలనే పెంచుతూ
కొత్త విజయ తీరాలను
సరి కొత్తగా అందుకుందామా
కొత్త రాగమే ఆలపిస్తూ
కొత్త తాళమును జతచేసి
కొత్త పల్లవులనే వ్రాసుకుంటూ
సరి కొత్తగా పాడుకుందామా
కొత్త ఊహల ఊయలఊగుతూ
కొత్త భావాలను కలుపుతూ
కొత్త కలలనే నిజంచేస్తూ
సరి కొత్త అడుగులను వేద్దామా
కొత్త ఉషస్సులో
కొత్త పూల నెత్తావులలో
కొత్త మలుపులనే దాటుకుంటూ
సరి కొత్త గమ్యమే చేరుకుందామా!
**-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి