బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతా సమూహ సహితమగా వచ్చిన శివునికి స్వాగత సత్కారాలు - నారదుని ద్వారా మేనకకు పెళ్ళి వారి పరిచయం - ఆమె శివుని, శివగణములను చూచి మూర్ఛ పోవుట*
*నారదా! తనను ముందుగా చూడలనుకున్న మేనక ఉత్సాహము తెలుసుకున్న శంభుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు విష్ణువు, బ్రహ్మనైన నేను రెండు వేరు వేరు దిక్కుల నుండి సకల దేవతాగణములను వెంటబెట్టుకొని హిమాచల నగరానికి వెళ్ళాము. మా వెనుక శివ గణము లతో కూడి ఈశానుడు వచ్చారు. తమ ఇంటికి వచ్చే పెళ్ళి వారిని చూసి పరిచయం చేసుకోవడానికి మేనక నారదా! నీతో కలసి ఎత్తైన మేడ మీద నిలుచుని ఉంది.*
*శివా శివుల వివాహ మహోత్సవానికి వివిధ వాహనముల మీద వసువు మున్నగు గంధర్వులు, మణిగ్రీవాది యక్షులు, దిక్పాలురు అందరూ, దేవేంద్రుడు, మిగిలిన దేవతాగణములు వచ్చాయి. వారిలో ఉన్న దళాధిపతిని చూచి " ఈతడే శివుడు అయ్యుంటాడు. పార్వతి వివాహం చేసుకునేది వీరినే కదా, నారదా" అని నిన్ను అడిగింది. అమ్మా, వీరందరూ శివునికి సేవకులు అని నీవు చెప్పగా, మళ్ళీ జగత్పతి కోసం ఆతురుతగా చూడసాగింది, మేనక. ఇంతలో, గరుఢారూఢుడై, సర్వాభరణ భూషితుడై, వకుళమాల ధరించిన విష్ణుమూర్తి వచ్చారు. "ఈతడేనా, నా కాళికి కాబోవు భర్త" అని అడిగింది మేనక.*
*"మేనకా దేవీ! ఈతడు విష్ణు భగవానుడు. శంకరుని అన్ని కార్యాలను చక్క బెట్టే వాడు. శంకరునికి అత్యంత ప్రియమైన వారు. పార్వతికి కాబోవు భర్త, వీరికంటే ఎంతో ఎక్కువ అయిన వారు. ఆయన బ్రహ్మాండానికి అధిపతి. సర్వేశ్వరుడు. స్వయం ప్రకాశుడు. పరమాత్మ " అని చెప్పగా మళ్లీ తన అన్వేషణ కొనసాగిస్తుంది, మేనక.*
*నారదా! నీ మాటలు విన్న మేనక, "తనకు కాబోయే అల్లుడు, సర్వజగత్తుకూ అధికారి. సర్వమంగళుడు. కనుక పార్వతి చాలా భాగ్యవతి అవుతుంది. ఎన్నో సుఖ సంతోషాలతో, సంపదలతో ఉంటుంది. ఇటువంటి కూతురిని కన్న నేను ధన్యురాలిని. ఇంతటి భాగ్యవంతుని అల్లునిగా పొందుతున్న, హిమవంతుడు, మా వంశం మొత్తం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాము" అని నీతో చెపుతూ మురిసి పోయింది.*
*మేనక, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే, శివ గణములతో శంభుడు అక్కడికి వచ్చారు. ఆయనని చూపుతూ, నీవు, "మహారణీ, మేనకా! ఇడిగో వచ్చారు. మీ కాబోయే అల్లుడు. ఇతడే శంకరుడు. ఈతనిని పొందుటకే మీ కుమార్తె గొప్ప తపస్సు చేసింది" అని చెప్పగా, కన్నలు విప్పార్చుకుని చూచింది, మేనక. అలా వస్తున్న శివ గణము లలో, కొందరికి ముఖములు, గడ్డములు మీసములతో నిండి పోయాయి. కొందరికి పది పది చేతులు, ప్రతి చేతిలో ఒకే పుర్రె ఉన్నాయి. కొందరు ముఖాలే లేనివారైతే, మరి కొందరికి వీపు భాగంలో ముఖాలు ఉన్నాయి. తలలు లేని వారు కొందరైతే, పదేసి తలలు ఉన్న వారు కొందరు. చేతులు లేనివారు కొందరు. ఈ విధంగా అందరూ ఏదో ఒక వికృత రూపంతో ఉన్న వారే. కొంతమందికి కన్నులు లేవు. మరికొందరికి ఎన్నో కన్నులు ఉన్నాయి. ఈ గణములు అన్నీ లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. వీరందరూ శివుని సేవకులు అని పరిచయం చేసావు, నారదా.*
*శివ గణములను, వారి ఆకృతులను చూసి మేనక నిరుత్సాహం చెందుతుండగానే, శంభుడు వచ్చారు, చూడమన్నావు, నీవు. ఈశానుడు, ముసలి ఎద్దు మీద వస్తున్నారు. అయిదు ముఖాలతో, ముఖానికి మూడు కన్నలతో, పది చేతులతో, ప్రతీ చేతిలో పుర్రె పట్టుకుని, శరీరమంతా వీబూది అలముకుని, జటలు వేలాడుతుంటే చంద్రవంకతో, పులి చర్మము కప్పుకుని పినాకము, త్రిశూలం ధరించి, ఎనుగు చర్మము వస్త్రముగా చేసుకున్న స్వామి ఆకారం ఎంతో వికృతంగా ఉంది. చూడడానికి చాలా భయం కలిగిస్తోంది, సర్వజగద్రక్షకుని ప్రచ్ఛన్న రూపం. ఈ రూపాన్ని చూసిన వెంటనే, తాను ఎంతో మోసపోయాను అనే ఆలోచనతో మూర్ఛ పోయింది, మేనక. తన చెలికత్తెల పరిచర్యలతో నెమ్మదిగా తెలివి తెచ్చుకుంది, గిరిరాజు మానసోల్లాసిని, మేనక.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి