కందం:
*ధరణిని పరోపకారా*
*చరణ వ్రతనిష్ఠనెపుడు సలుపుము నీకా*
*తెరగున వాసాదివ్రత*
*వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద పుట్టిన తరువాత ఎదుటి వారికి మంచి చేయడం / ఉపకారం చేయడానికి మించిన వ్రతము ఇంకొకటి ఉండదు / లేదు. అందువల్ల నువ్వు ఆ పరోపకారం అనే వ్రతాన్ని ఎప్పుడూ ఆచరించు. పూజలు, వ్రతాలు, యజ్ఞ యాగాదులు చేసినప్పుడు వచ్చే పుణ్యం కంటే, ఎదుటి వారికి సహాయపడటం వలన వచ్చే పుణ్యమే ఎక్కువగా ఉంటుంది....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"మనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి" అనే పెద్దల మాట. ఒకరికి అపకారం తలపెట్టాడు అంటే, ఆ మనిషి మనసులో అసంబద్ధమైన, నలుగురకీ చెడు కలిగించే ఆలోచనలు నడుస్తున్నాయి. అందుకే, మనం మన నిత్య ప్రార్థన లో, "అందరినీ మంచివారిగా చేయి. అందులో నేను ఉండేటట్లు చేయి" అని ప్రార్ధించడం. "సర్వే జనా సుజనా భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు". ఈ భూమి మీద ఉన్న చెడు ఆలోచనలు కల వారిని కూడా మంచి వారిగా చేయి, స్వామీ! చెడు ఆలోచనలతో సతమతమయ్యే వారు, ఎవరికైనా అపకారం చేసే అవకాశం ఉంది. కనుక, వారిలో ఆ చెడు ఆలోచనలను తొలగించి మంచి వారిగా మార్చు. అప్పుడు నీ సృష్టి అంతా ఆనంద మయం అవుతుంది. ఈ విధమైన నలుగురి మంచినీ కోరే మంచి బుద్ధి మనమందరం కు ఇవ్వమని, కాలభైరవ కటాక్షం కలిగేలా అనుగ్రహించాలని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి