*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 032*
 కందం:
*పని బూని జనులు సంతస*
*మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం*
*చిన యశము నొందుచుందురు*
*గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారా !*
తా:
కుమారా! మనుషులు అందరూ సంతోషంగా సత్యంను నమ్మి, మంచి ప్రవర్తన తో, ఓర్పుతో పనులు చేయాలి. ఇలా ఉన్నవారికే మంచి పేరు లభిస్తుంది. ఈ దారే మంచి దారి అని తెలుసుకుని నడుచుకో....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఓర్పు, సహనం కలిగి ధర్మాన్ని నమ్ముకుని మనం ప్రయాణం చేస్తే, ఆలస్యంగా అయినా సత్ఫలితమే వస్తుంది. వ్యాస భగవానుని మహాభారతం మనకు చెప్పింది ఇదే. కృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టక ముందునుండే తన తల్లిదండ్రుల ద్వారా ఓర్పు, సహనం ఇచ్చే సత్ఫలితాన్ని చూపించారు. ఇప్పుడు మనకు తెలిసిన, మనం విన్న గాంధీ, పొట్టి శ్రీరాములు, ఆచార్య వినోబా భావే వీరందరూ మనకు చూపించిన దారి కూడా ఇదే కదా! మరి ఇంత మంది నడచిన దారిలో మనం కూడా నడచి, మంచి పేరును, ఫలితాలను పొందే మంచి బుద్ధిని మనకు ఇమ్మని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు