*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 034*
 కందం:
*సరి వారి లోన నేర్పున*
*దిరిగెడి వారలకు గాక తెరవాటులలో*
*నరయచు మెలగడి వారికి*
*పరు వేటికి గీడె యనుభవంబు కుమారా !*
తా:
కుమారా! నీ తోటి వారితో కలసి మెలసి పరిస్థితులకు అనుగుణంగా మెలిగినప్పుడే నీకు గౌరవంగా ఉంటుంది. కానీ, తెరలచాటున, మన ముందు ఒకలాగ, వెనుక వేరొక లాగా వుండే వారితో కలసి ఉంటే వారికీ గౌరవం ఉండదు. నీకు కూడా గౌరవంగా ఉండదు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మనం ఊసరవెల్లి లాగా ఎప్పుడూ ఉండకూడదు అనేది పెద్దల మాట. మనం మంచి వారితో కలసి వుంటే, మంచి ఆలోచనలు, లక్షణాలు అబ్బి నలుగరిచేతా మంచి వారము అనిపించుకుంటాము. నులుగురికి మంచి చేసే ఆలోచనలు వస్తాయి. మంచి ఫలితాలను ఇస్తాయి. అలా కాకుండా, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటే, ఈ మనిషికి ఏమాత్రమూ నిలకడ లేదు. ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. గాలి ఎటు వీస్తే అటు వెళుతూ ఉంటాడు, అని ఎవరూ మనని ఇష్ట పడరు, గౌరవంగా చూడరు. అందుకని, నలుగురినీ అర్థం చేసుకుంటూ, చేతనైనంత మంచి చేస్తూ, బతికన కొంతకాలం కోకిలలా బతికే చక్కని అవకాశం ఇమ్మని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు