పద్మ శ్రీ బందా (16);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,నెల్లూరు
 గొల్లపూడి మారుతీరావు రేడియోకి రాక ముందే నాటక రచయితగా ప్రఖ్యాతులు. వారు రాసిన నాటకాలలో రాగరాగిణి ముఖ్యమైనది కే వెంకటేశ్వర రావు ద్వారా అనేక ప్రదర్శనలలో  మంచి పేరు తెచ్చుకున్న ఆ నాటకం అంటే నండూరి విఠల్ కు మోజు.  ఆయన ప్రధానోపాత్ర నేను, రజిని, నాగరత్నమ్మ, శ్రీరంగం గోపాల రత్నం, నండూరి  సుబ్బారావు, సి రామ్మోహన్రావు శ్రీధర్ రావు, కుటుంబరావు మేమంతా మిలిగిన తారాగణం. ఆ నాటకం ప్రసారమైన తర్వాత వేదికపై ఆ నాటకానికి మంచి పేరు తీసుకొచ్చిన కే వెంకటేశ్వరరావు మా దగ్గరకు వచ్చి మీ నాటక నిర్వహణ  ఆయన రంగస్థలనాటకాన్ని మించిందని పొగడ్తలతోముంచి వేశాడు. చిన్నవేషమైనా నీవు నండూరి విఠల్ ను తినేశావ్ నాన్నా నీ రంగస్థల నాటకం ఛైర్మన్ చూశాను. దాంట్లో నిన్ను కే వెంకట రాజు గారిని అభినందించ కుండా ఉండలేను అని నండూరి విఠల్ బందా గార్ల ఎదురుగా అనడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రాచకొండ నరసింహమూర్తి గారి మరో నాటకం దేవి చౌదరి హిందీలో రచించింది  దానిలో నేను నా సహనటిగా బిందు, మురళి లక్ష్మీ పాల్గొన్నారు. రాచకొండ వారి రచన అనువాదము అని అనిపించదు స్వతంత్ర రచన గానే సాగుతుంది వారికి హిందీ భాష పై మంచి పట్టు ఉంది  వారు అనువాదాలే కాక హిందీలో నాటకాలను కూడా రాశారు. వాటిలో రాజధాని ఒకటి.  ఆ హిందీ నాటకంలో నేను నాగరత్నమ్మ గారు, రామ్మోహన్ రావు గారు  నటించాం. వింజమూరి శివరామారావు గారు అల్లా జయ్ గారి హిందీ రూపకాన్ని భారత నాటక రంగంపేరుతో అనువదించారు. దానిలో  నేను నాగరత్నమ్మ గారు నటించాం నిర్వహణ బందా కనక లింగేశ్వర రావు గారు.
తాళ్లూరు నాగేశ్వరరావు గారు రచించిన నాటకం లక్ష రూపాయలు  హాస్య నాటకంలో బందా కనక లింగేశ్వర, నండూరి, శ్యామల సూర్యనారాయణ నాగరత్నములతో పాటు  నేను పాల్గొన్నాను ఆ నాటకం అయిపోయిన మరుక్షణం సరిహద్దు సమరంలో అన్న రూపకాన్ని  బందా గారి నిర్వహణలో చేసాం. నల్ల వజ్రము నాటకంలో  ఎం నాగరత్నమ్మ గారు, నండూరి,  కుటుంబరావు గారు, సి రామ మోహన్ రావు గారు నేను  పాల్గొన్నాము. విఠల్ గారి పూర్తి పేరు నండూరి పాండురంగ విఠల్ వారిది ఏవై మన్నార్ ది ఆరుగొలను గ్రామం. దాని ప్రక్కనే నండూరి సుబ్బారావు గారి గ్రామం. నండూరి వారు  రేడియోలో చేరడానికి ప్రధాన కారకుడు విఠల్ మొదట ఆయన అనౌన్సర్ గా ఒంటరిగా తర్వాత ట్రాన్స్ మిషన్ ఎక్సిక్యూటివ్ గా చివర పెక్స్ గా ఆపైన స్టేషన్ డైరెక్టర్ గా రిటైర్ అయి చిన్న వయసులోనే మరణించారు.కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం