తిరుప్పావై పాశురం-17, డాక్టర్ అడిగొప్పుల సదయ్య
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్నందగోపాలా ! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే ! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా ! అఱివుఱాయ్

అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే ! ఉఱంగాదు - ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా !
ఉమ్బియుం నీయుం ఉఱంగ్ - ఏలోర్ ఎంబావాయ్

తిరుప్పావై ఇష్టపది-17

అంబరము,తన్నీరు,అన్నముల నర్ధులకు
నరసి యొసగెడి స్వామి! నందగోపా! లెమ్ము!
కొమ్మలెల్లర మేటి! ! గొల్లకుల దీపమా!
మా రాజ్ఞి! యశోదా! మా తల్లి! మేలుకో!

అభ్రమంతకు నెసగి అడుగులను లోకాల
అవలీల గొలిచితివి అదితిసుత! వామనా!
నిత్య సూరుల స్వామి! నిదురనాపియు లెమ్ము!
బంగారు కడెముతో పదమడరు బలరామ!

అనుజుడును,నీవునూ ఆత్రముగ లేవండి!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

 
అంబరము = వస్త్రము,తన్నీరు = మంచినీరు
అర్థులకు = అడిగినవారికి,అరసి = మంచిచెడ్డలు తెలుసుకొని
ఒసగెడి = ప్రసాదించు,కొమ్మలు + ఎల్లర = స్త్రీలందరిలో
రాజ్ఞి = రాణి,యజమానిని
అభ్రము+ అంతకు = ఆకాశమంత ఎత్తుకు
ఎసగి = వ్యాపించి
నిత్య సూరులు = ఆళ్వార్ ,ఆచార్యాది ముక్తులు
పదము+ అడరు =ప్రకాశించే పాదము గల
అనుజుడు = తమ్ముడు,ఆత్రము = వేగముగా,వెంటనే

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
9963991125

కామెంట్‌లు