(గోదమ్మతో పాటూ వచ్చిన గోపికలు నందగృహము చేరి భాగవత సమాశ్రయణము చేసినా కూడా శ్రీ కృష్ణుడు లేవకపోవడముతో వారందరూ నీళాదేవి పురుషకారమును కోరడమే ఈ 18 వ పాశురము యొక్క సారాంశము)
(ఈ 18 వ పాశురాన్ని రెండవ తేదీనాడు అనుసంధానము చేయాలి)
పాశురము ~ 18
ఉన్దు మదకళిற்றన్ ఓదాడ తోళ్ వలియన్
నన్దగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్
కన్దఙ్కమళుం కుழలీ కడై తిఱవాయ్
వన్దెఙ్గుమ్ కోழிఅழைత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినఙ్గళ్ కూవినకాణ్
పన్దార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్ పాడ
శెన్దామరై కెయ్యాల్ శీరార్ వళై యొలిప్ప
వన్దు తిఱవాయ్ మగిழ் న్దు ఏలోరెంబావాయ్!
ప్రతిపదార్థాలు:
ఉందు
స్రవించుచున్న;
మదకళిற்றన్ మదము కల ఏనుగుల వంటి బలము కలవాడు;
ఓదడా తోళ్ వలియన్
జంకని బలము కల భుజములు కల;
నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ నందగోపుని మేనకోడలైన ఓ నీళాదేవీ;
కందం కమழுమ్ కుழలీ కడై తిరవాయ్
సువాసన ప్రసరింపచేయు కురులు కలదానా! తలుపు తీయవమ్మా;
వన్దెఙ్గుమ్
వచ్చి అంతట;
కోழி అழைత్తనకాణ్
కోళ్ళు అరచుచున్నవి చూడమ్మా!
మాధవి పన్దల్ మేల్ పల్ కాల్
గురువింద పందిరిమీద పలుమార్లు;
కుయిల్ ఇనంగళ్
కోకిల గుంపులు;
కూవిన కాణ్ కూయుచున్నవి చూడమ్మా;
పన్దు ఆర్ విరలి
బంతి పట్టుటచేత పరిపూర్ణమైన వ్రేళ్ళు కలదానా;
ఉన్ మైత్తునన్
నీ మామ కొడుకు (భర్త)యొక్క;
పేర్ పాడ
పేరు కీర్తింపగా;
శెందామరై కైయాల్ కెందామరల వంటి చేతులతో;
శీరార్ వళై ఒలిప్ప అందమైన గాజులు ఘల్లు ఘల్లు మని చప్పుడు కాగా;
వందు తిరవాయ్
వచ్చి తలుపు తెరవ వమ్మా!
మగిళిందు ఏలో రెంబావాయ్
సంతసించి వ్రతాన్ని ఆచరిస్తాము.
భావము:
నీళాదేవి శ్రీకృష్ణుని మేనమామ, యశోద తమ్ముడు, అయిన కుంభగోపుని కూతురు; పోతరించిన ఏడు
ఎద్దులను నిగ్రహించి వీర్యశుల్కముగా ఈ నప్పిన్న పిరాట్టిని వివాహమాడినాడు. ఆమె బాహుపరీరంభమున సుఖనిద్ర జెందిన కృష్ణుని బయటకు రప్పించవలెనని తొలుత ఆమె బాహుబంధముల నుండీ విడిపించవలెను. ఆమె దయదలచినగానీ
ఆ కార్యము నెరవేరదు. అందుకే ఆమెను లేపుచున్నారు గోపికలు. కోళ్ళు కూయుచున్నవి; కోయిలలు కేకారుచూ రొదచేయుచున్నవి. ప్రియునితోబాటుచెండాడి అలసి నిద్రించితివేమో, ఇకనైనా లేచివచ్చి నీ కెందామరలవంటి చేతులతో నీ గాజులు గలగలమని తలుపు తీయవమ్మా! నీ ప్రియుని కీర్తింప వచ్చిన
మాపై దయజూపవమ్మా! అని అర్థించినారు గోపికలు!
వ్యాఖ్య:
ఇక్కడ నందగోపాలుడనగా ఆచార్యుడు ~ గజమనగా భగవానుడు; భగవానుని వశములో ఉంచుకున్న ఆచార్యుడే ఏనుగులను వశీకరించుకొను నందగోపుడు. గడియ తీయుట అంటే అమ్మ కటాక్షించి కర్మానుగుణముగాకాక కృపానుగుణముగా మనను పరమాత్మ రక్షించునట్లు చేయుట. కోళ్ళు అంటే భగవత్ కైంకర్యము నందు శ్రద్దకల భగవద్భక్తులు ఆచార్యులు. కోకిలలు అనగా మధురగానము చేయు ఆళ్వార్లు. బంతి అంటే లీలా విభూతి. చేయి అంటే
జ్ఞానము. సౌందర్యము అనగా ఇతర విషయ నివృత్తి, సౌకుమార్యము
స్వభోక్తృత్వ నివృత్తి. సౌగంధర్యమనగా నిరతిశయ ప్రేమ ~ చేతి గాజులు అంటే అనన్య శరణత్వము, అనన్య భోగ్యతము!
అనువాద పద్యము:
మదలుటేన్గుల గముల్ మర్దింప జాలిన
అర్గళ దీర్ఘబాహా విలాసు
శ్రీ నన్దగోపుని మేనకోడల సోగ
నిగుల వలపుల నెరులదాన
నీలాసతీదేవి! కోలాహలము సేయు
కొక్కొరోకో యంచు కోళ్ళగుంపు
గురువింద పందిరి కొననెక్కి కుహూ కుహూ
కుహూ యంచు కోయిలల్ గూయదొడగె
కందుకమునాడి యలసిన కన్నె మిన్న
నిదుర లేలెమ్ము కీర్తింప నీదు ప్రియుని
తలుపు దీయుము కెందామరలను బోలు
కరతలమ్ముల నులియంగ గంకణములు!
(ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి