(నరసింహ గోష్టి నుండీ)
(సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్: &
Edited by ఫణిహారమ్ రంగనాథ్)
(10.1.23
(గోపికలు భగవత్కైంకర్యముగా వ్రతాన్ని ఆచరించుటకు ఆవశ్యకములైన
పరికరములను కృష్ణుని కోరుచున్నారీ పాశురములో)
మాలే మణివణ్ణా! మార్గழி నీరాడువాన్!
మేలైయార్ శెయ్ వనగళ్! వేణ్డు వన కేట్టియేల్
ఞాలత్తై ఎల్లామ్ నడుఙ్గ మురల్వన!
పాలన్న వణ్ణత్తు! ఉన్ పాఞ్చశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్! ప్పోయ్ ప్పాడుడైయనవే!
శాలప్పెరుమ్ పఱైయే! పల్లాణ్ డి శైప్పారే!
కోలవిళక్కే! కొడియే వితానమే!
ఆలినిలైయాయ్ అరుళ్! ఏలో రెంబావాయ్
ప్రతిపదార్థాలు:
మాలే~ ఆశ్రితవ్యామోహము కల స్వామి!
మణివణ్ణా ~ ఇంద్రనీలమణి వంటి వన్నె కలవాడా;
మార్గళి నీరాడువాన్~ మార్గశిర స్నానమాడుటకు;
మేలై యార్ శైవనగళ్-పెద్దలు చేయు పనులు;(మాకు ఆజ్ఞాపింపబడినవి);
వేణ్డువన కేట్టి యేల్~ మాకందరికీ కావలసినసామాగ్రియూ (యేమి అని)
అడిగిన చెప్పెదము వినవయ్యా!
ఞాలత్తు ఎల్లామ్ నడుఙ్గ మురల్వన~ లోకమంతా దద్దరిల్లునట్లు మొరయునట్టి;
పాలన్న వణ్ణత్తు~ పాలవన్నె గల;
ఉన్ పాఞ్చశన్నియమే పోల్వన శఙ్గఙ్గళ్~ నీ పాంచజన్యమును పోలిన
శంఖములు;
పోయ్ పాడు ఉడై యనవే~ అతి విస్తారత గలిగిన;
శాలప్పెరుం పఱైయే ~ చాలా పెద్దదైన వాద్యమును;
పల్లాణ్డు ఇశైప్పారే~ పల్లాండు (మఙ్గళాశాసనము) చెప్పువారు;
కోల విళక్కే కొడియే వితానమే~ దీప స్థంభమునూ ధ్వజమునూ
మేల్కాట్టునూ;
ఆలి నిలై యాయ్~ మర్రి ఆకు నిలయముగా గల ఓ వటపత్రశాయీ!
అరుళ్ ఏలో రెంబావాయ్ ~ మాకు అనుగ్రహించవయ్యా?
భావము:
ఆశ్రిత వ్యామోహము
స్వభావముగా కలవాడా!
ఇంద్రనీలమణిని పోలిన కాంతి కలవాడా! చిన్న
మర్రి ఆకుపై పరుండి
అఘటిత
ఘటనా సామర్థ్యము
కలవాడా! మేమందరమూ
మార్గశీర్ష స్నానమును
చేయగోరి
ఆ వ్రతానికి కావలసిన పరికరములను కోరడానికి వచ్చినాము. ఈ వ్రతాన్ని పూర్వులు
ఆచరించి ఉన్నారు. నీవు దయచేసి కాస్త వింటే
మాకేమి
కావలెనో చెప్పెదము. ఈ భూమండలమంతయూ
వణుకునట్లు శబ్దముచేయు పాలవలె
తెల్లనైన
నీ పాంచజన్య శంఖమును బోలిన శంఖములు
కావలెను. విశాలమైన
చాలా పెద్ద పర కావలెను. మంగళాశాసనపరులగు
భాగవతులుకావలెను.
మంగళదీపములు
కావలెను. ధ్వజములు,
మేల్ చాట్ లు కావలెను. దయచేసి
వీటినన్నీ మాకు
ప్రసాదించవయ్యా స్వామీ? అందుకు స్వామి ఒప్పుకొని తన శంఖమును వాటికి వేరు లేనందున తన
పాంచజన్యమును,
మంగళాశాసన పరులందు సాటిలేనివారైన పెరియాழ்వారలను,
ధ్వజముగా మేటియగు
వేద స్వరూపియగు గరుడుని, మంగళదీపములందు
సమస్త లోక దీపాంకురయగు పిరాట్టి అగలగిల్లేన్ యిఱైయుమ్ అను స్వభావముకలది
కనుక ఆమెకు బదులు నీళాదేవిని,
శేషత్వచరమావధి
యగు అనన్తాழ்వాన్
తమనువీడి
నిలువలేనందున తమ
పీతాంబరమును
వారలకు అనుగ్రహించిరని భావము!
వ్యాఖ్య:
మణి ఉన్నవారు ~ లేని
వారు ఉన్నట్టుగా,
భగవంతుడు ఉన్నాడని కొందరు,
లేడని మరి కొందరూ
ఉన్నారు. మణి ఉన్నవారిని ఎలా గౌరవింతురో అలానే
భగవంతుడున్నాడని
నమ్మేవారు భగవంతునికి
దాసోహమంటారు.
ఇక్కడ స్నానమనగా
భగవద్గుణాశ్లేషమే, ప్రపన్నులు ఆచరించు
కైంకర్యముగా
పరిగణించాలి; కర్మలను త్యజించక
ఫలసంగ కర్తత్వ
త్యాగపూర్వకముగా
ఆచరించుటే ఈ స్నానము. శిష్టాచార అనుసరణ
అంటే భగవద్భాగవతా
చార్య ఆజ్ఞానుసరణము
శంఖమంటే ప్రణవము.
కైంకర్యము లేనిదే
శేషత్వము
నిలువదు ~ కనుక ప్రణవ శబ్ధానికి కైంకర్యము అని అర్థము. ఆ కైంకర్యాలు
పలు విధాలుగా ఉంటాయి
కనుక పలు శంఖములు
అని అన్వయించుకోవాలి.
పెద్ద పర అనగా నమః
పదమని; పండులోని గుణములు
భోక్తకు ఆనందమిచ్చునే
కానీ పండుకు కాదు కదా! నమః పదము ఇటు
ప్రణవము లోనూ అటు
నారాయణ పదములోనూ అన్వయిస్తుంది కనుక
చాలా పెద్దది అని అర్థము.
పరమ భాగవతోత్తములు కావాలని అడిగినారు ~ అంటే సత్సాంగత్యమే
పురుషార్థసీమకు
చేరుస్తుంది అని.
కోలవిళక్కే అంటే జీవుని
భగవత్ శేషత్వ మంగళ
దీపము. కొడి అంటే ధ్వజమనే కైంకర్యము. దానిని
శ్రియః పతి అంగీకరించినపుడే అది పురుషార్థమవుతుంది. ఇక వితానమంటే చాందినీ ~ దారిలో
పోతూంటే తలలపై మంచు పడకుండా రక్షగా ఉండేది.
అనన్యార్హ శేషత్వజ్ఙానము, పారతంత్ర్ర్య జ్ఞానము
భాగవత సహవాసము,
భాగవత శేషత్వ జ్ఞానము, భగవత్తైంకర్యము, కైంకర్యమున భోక్రృత్వబుద్ది
నివృత్తి కావాలి అని
కోరడము.
అనువాద సీస పద్యము:రచయిత: శ్రీ కుంటిమద్ది శేషశర్మగారు
తమికాడ! హరిమణిరమణీయ! మార్గ శీ
ర్ష స్నాన జప తపాచార పరులు
శిష్టులొనర్చేడి చెయిదమ్ము లర్థమ్ము
లెవ్వినా, ఆలింపు మిందిరేశ!
వటపలాశ శయాన! నటనా విచక్షణ
స్థిర దద్దరిల్ల శబ్ధించునవియు
పాల వన్నెల నీదు పాంచజన్యము బోలు
కమనీయములు శంఖములు మాకు
నీకు పల్లాండు పాడెడి నెలతలకును
నను గుణంబగు డక్కి, కేతనము కంబ
దివ్వియలు మేల్వితానము దివ్యమంగ
ళాంగ! దయసేయుమా! కరుణాంతరంగ!
(ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి