తిరుప్పావై )పాశురము 27 ; -సి. మురళీమోహన్
 కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ *పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్
భావము :
          నీతో కూడని వారిని, నిన్ను వ్యతిరేకించేవారిని, నీపట్ల విముఖులను జయించేవాడా!  గోవిందుడు అనెడి నామము గలవాడా, కళ్యాణగుణములు గలవాడా! నిన్ను కీర్తించి, వ్రతసాధనమగు 'పరను'పొంది, నీతో మేము పొందదలచిన సన్మానము లోకులు అందరూ పొగిడేలాగా ఉంటుంది. మా కరములకు దివ్యములైన గాజులు, మా బాహువులకు కంకణములు,  మా చెవులకు కమ్మలు, బంగారు చెవిపూవులు, మేలైన చీరలు, రవికలు, కాలికి ఘల్లుమనే మువ్వలను నీవు ప్రసాదించాలి. పాలతోవండిన దివ్యాన్నములపై నేతి వర్షములు కురిపించి చేసిన ప్రసాదమును, క్షీరాన్నమును నీ సరసన ఘనముగా కూర్చుండి, మా మోచేతులమీదుగా ధారలుగా కారుతుండగా ఆ పాయసాన్ని  త్రాగాలి! యిదే మా వ్రతఫలితముగా మేము పొందేట్లు వరమివ్వు స్వామీ!
              శ్రీ వరాహస్వామి పరిపూర్ణ  కృపాకటాక్ష అనుగ్రహ  సిద్ధిరస్తు
సర్వేజనాస్సుఖినోభవంతు
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
శుభం భూయాత్

కామెంట్‌లు