భారత గణతంత్రమా! వందనం స్వీకరించుమా!- డా.పివి.ఎల్.సుబ్బారావు.-9441058797.
 జనవరి 26, 2023,
74వగణతంత్రదినోత్సవ,
వసంతపంచమిదినోత్సవ,,శుభాకాంక్షలతో,
+++++++++++++++++++++++++++++++
1.మంచితనం మనిషి మూలం!
  
  వృత్తి,ప్రవృత్తులలో ఉద్దీపనం!
   
  మంచిగా పుట్టిన మనిషి! 
  మలచుకో,నీవు మరోమహర్షి! 
  మంచి పెంచు,పంచు, ఎంచు!
2. మనిషి నవత మానవతే! 
   మానవత్వం వినా  ఘనత? 
 మంచితనం లేని ప్రతిభాధనం! 
  సమాజానికి ఎంతో హానికరం! 
అది పాముపడగ మణి చందం!
3. చెద పురుగై జీవించకు!   
    
   పట్టుపురుగై మరణించు!  
    
  దుర్మార్గుడు జీవిస్తే,
            జాతికి శిరోభారం!
 
 సహృదయుడు మరణించినా, 
       తరతరాలకు ఉత్ప్రేరకం! 
  పురుషోత్తముడి నడత,
      యుగయుగాలకు ఆదర్శం!
4. వ్యక్తిహితం,
 సమాజహితాన అంతర్లీనం!
 
వ్యక్తి జీవితం ,
          సమాజానికి అంకితం! 
సద్గుణవంతులే,
         నేడు జాతికి అవసరం! 
మేధావులు సద్గుణులైతే,
        జాతి  ఆనందం ఆర్ణవం!
 
స్వార్థం జయిస్తే,
  వారే పుణ్యపురుషావతారం!
5. వ్యక్తికి బహువచనం శక్తి!
    
    సమాజం యువశక్తి ,
                తరంగాల సంద్రం!
     
   యువశక్తికి ఆహ్వానం,
        పలుకుతోంది మాతరం!
 
  విశ్వశాంతికి ,
       సదా ముందే మాతరం !
భారతి ,సరస్వతి అనుగ్రహించే, పుణ్యదినసంగమ సమయం!
 మనిషి జీవనమూలం,
        "మంచి" భద్రం, నిజం!
దేశమనెడి దొడ్డవృక్షం,
         సంక్షేమ పూల భరితం!
________


కామెంట్‌లు