ఆలోచించు;-:సి. హేమలత--(లతాశ్రీ) పుంగనూరు ఫోన్ నెంబర్: 9666779103
పచ్చి ఆకుల మాటున తొంగిచూసే
 చల్లని వెన్నెల తన మనసు ప్రశ్నించు
 కానీ అనుమానించకు 
మాటలతోటాలతో బతికున్న శవాన్ని చేయకు

పౌరుషంగా మాట్లాడను
 పరుషంగా మాట్లాడడం రానిబేల
మనసులో కాస్త చోటేస్తే మమకారపు జల్లులు కురిపించి తరిస్తుంది

ప్రకృతి సోయగాలకు పరిమళ మద్ది అల్లిబిల్లి వయ్యారాల చిరుగాలి తను
జాగ్రత్తలు చెప్పు కానీ జడపదార్థం చేయకు
ఆత్మాభిమానం దెబ్బతీసేలా దెబ్బలాడకు

లోటు పాట్లు అర్థమయ్యేలా చెప్పు లోపాలుగా చిత్రించి భూతద్దంలో చూడకు
ధైర్యాన్ని దహింప చేసి మూడులా మిగల్చకు

కల్మషం లేని మనసులో చోటు ఇవ్వు 
అమ్మలా ప్రేమించి అక్కున చేర్చుకుంటుంది
అర్థం చేసుకోలేని శిలగా మనసును మార్చుకోకు 
మరుభూమిలా ప్రేమను మార్చుకోకు

అనుమానపు గుడ్డితనంతో అద్దం లాంటి మనసును ముక్కలు చేయకు
జీవితాన్ని వ్యర్ధంగా మట్టిలో కలిపేయకు

కామెంట్‌లు