🙏మహా దేవుడు శివుడు!
దేవ దేవుడు శివుడు!
విశ్వ దేవుడు శివుడు!
ఆత్మ బంధువు లార!
( ఆత్మబంధు పదాలు., శంకరప్రియ.,)
👌ఆది దేవుడు.. సాంబ శివుడు! దేవత లందరికి ప్రభువు! కనుక, "అమరేశుడు"! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు.. మున్నగు దేవతలకు పూజ్యుడు! కనుక, "మహా దేవుడు" పరమ శివుడు!
"అమరేశో మహాదేవః!
విశ్వదేవః సురారిహా!"
...అని, మహాభార తాంతర్గతమైన, శ్రీశివ సహస్ర నామ స్తోత్రము నందు అభివర్ణించారు, గీతాచార్యుడైన వాసుదేవుడు!
👌"మహాంశ్చ అసౌ దేవశ్చ.. మహా దేవః!" అని, అమరకోశం నిర్వచనం ప్రకారం; శ్రేష్ఠుడైన దేవుడు.. శంకర భగవానుడు!
"విశ్వ" మనగా చరాచర ప్రపంచము! "విశ్వ" మనగా విష్ణు మూర్తి! అని, విశేషార్ధము! ఈ "విశ్వము"నకు, ఆ "విష్ణువు"నకు ఆరాధ్య దైవము! కనుక, సాంబ శివుడే "విశ్వ దేవుడు", పరమేశ్వరుడు!
👌శ్రీశివుని ద్వాదశ నామములు.. పరమ పవిత్రములైనవి! పరమేశ్వరునకు ప్రీతిపాత్రము లైనవి! అవి, సాధకులకు జన్మ సార్థకత నొసంగు చున్నాయి! అవి..
మహాదేవ (1)..
మహేశ్వర (2).. శంకర (3).. వృషభ ధ్వజ (4).. కృత్తివాస (5).. కామాంగ నాశన (6).. దేవ దేవేశ (7).. శ్రీకంఠ (8).. ఈశ్వర (9).. పార్వతీ పతి (10).. రుద్ర (11).. శివ (12)... మున్నగు నవి; పరమశివుని యొక్క పదిరెండు (ద్వాదశ) నామములు! వీటిని నిత్యము భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి; నియమ నిష్ఠలతో పారాయణం చేసిన భక్త మహాశయులకు.. తెలిసీ తెలియక జేసిన పాతకము లన్నియు హరియించు చున్నాయి! సమస్త విజయములు సమకూర్చు చున్నాయి హర ఓం!
🚩సీస పద్యము:
🙏అతులితభక్తి "మహాదేవ"! యని పిల్వ,
పాపతూలంబులు భస్మ మౌను;
హే భక్త పోష! "మహేశ్వరా"! యని పిల్వ,
దుర్భావనాతతి దూరమగును;
"వృషభ ధ్వజా"! యని ప్రీతితో బిల్చిన,
కలుగు నాటంకముల్ తొలగిపోవు;
"కృత్తివాసా"! యంచు బత్తితో బిల్చిన,
కల్పాగమై తీర్చు కామితములు;
"దేవ దేవేశా"! సుధీజన సురనుత!
యని పిల్వ, వరముల నందజేయు;
"శ్రీకంఠ!" బాపు నాపునాసిల్గు చీకట్లన,
కరుణా ప్రభల వాని తరిమివేయు;
🚩తేటగీతి
🙏"ఈశ్వరా"! యని స్మరియింప, నెపుడు వెంట
నిలుచు; "పార్వతీ పతి" యన, కలుగ చేయు
శాంతి; "రుద్రా" యటన్నచో సౌఖ్య మిచ్చు;
"శివ" యటన్నచో నమితమౌ
శివము లొసగు;
ఈశ్వరుని సాటి యెవ్వరీ విశ్వమందు!!
(తెలుగు సేత: "అవధాని" ముద్దు రాజయ్య., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి