మార్కండేయ వరదుడు శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
 🙏శ్రీమ న్మహాదేవ!
హరహర! మహాదేవ!
    శంభో! శంకర! శివ!
శ్రీసాంబ! సదాశివ!
🙏మార్కండేయ వరద!
మహాకాల! అభయద!
    మమ్ములను కాపాడు!
శ్రీ సాంబ! సదాశివ!
       ( శ్రీసాంబశివ పదాలు., శంకరప్రియ.,)
👌మార్కండేయుడు
..మృకండ మహర్షి కుమారుడు! సన్మార్గముతో జీవించు వాడు! కానీ, అల్పాయుర్దాయం కలవాడు! శంకర భగవానుని ప్రియభక్తుడు! మహా లింగోద్భవు డైన పరమేశ్వరుని త్రికరణముల శుద్ధిగా ఆశ్రయించాడు! 
🙏తారక మహా మంత్రమైన "ఓం నమః శివాయ" యనెడు; ప్రణవ సహిత, శ్రీశివ పంచాక్షరిని నియమ నిష్ఠలతో జపించాడు! పార్వతీ పతియగు పరమేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణమునకు పాత్రుడైనాడు! భక్తమహాశయు లందరికి ఆదర్శ ప్రాయుడు.. భక్త మార్కండేయుడు!
   
👌బ్రహ్మాది వంద్యుడైన, మహా దేవుడొక్కడే.. దేవ దేవుడు! మహాకాల స్వరూపుడు! ఆ సాంబ శివుడు.. యముని కాలపాశ శక్తిని  నిర్వీర్యము చేసి; మృకండుని సుతుని సంరక్షించాడు! ప్రియ భాగవతుడైన, మార్కండేయుని "చిరంజీవి"ని కావించాడు! తల్లిదండ్రు లైన  మృకండమహర్షి దంపతులకు పరమానందం కలిగించాడు, మహా లింగేశ్వరుడు, శ్రీశివా మనోహరుఁడు!
🚩చంపక మాల
🙏హిమజ మనోహరా! కరుణ కెవ్వరు నీకెన దేవతాళులన్,
     శమనుని కాలపాశ ఘనశక్తిని భగ్నముసేసి, బాలకున్
     అమరుని జేసినావు గద! హర్షమునొంద మృకండ దంపతుల్!
      కమలజు వందితా! సుబల!గావవె యీభువి పార్వతీపతీ!!
        ( "భక్త కవిరత్న" భమిడిపాటి కాళిదాసు., )

కామెంట్‌లు