ప్రబోధ గీతం :- నిన్నలోనే..... !;-కోరాడ నరసింహా రావు !

 పల్లవి :-
   నిన్నలోనే... నువ్వుండిపోతే.. 
రేపు నీది కాదు సుమా.... !
 ఆగక సాగే కాలంతో... నువ్ 
పరుగులుతీయాలోయ్ నేస్తమా
     " నిన్నలోనే...... !"
చరణం :-
    మొన్నటిలా... నిన్నలేదు 
     నిన్నటిలా నేడూ లేదు... 
  నేటిలా రే పుండబోదు... !
 ఏ రోజుకు ఆరోజే...క్రొత్తదనపు 
 సింగారాలతో... వయ్యారాలు 
ఒలకబోసి మెరుపులా తళుకు మని కాలం మాయ మయి పోతుంది... !
  కాలం మాయమై పోతుంది !!
కోరస్ :- 
   ఆలోచిస్తూ... ఆగావంటే.... 
 వెనకబడి పోతావు, నువ్వేనకే ఉండిపోతావు ! కాలాన్నిఅందు
కోలేవు ! ఆ కాలాన్ని అందు కోలేవూ..... !!
           " నిన్నలోనే........ !"
చరణం :-
     నీ ఆలోచనలెల్లప్పుడూ... 
  కాలం కంటే   ముందుండాలి !
  నీ అడుగుజాడల్లోనే ఈలోకం 
 నడవాలి !
  సమాజ పురో గమనానికి నీవే
 మార్గదర్శి వవ్వాలి.... !
  నీవే మార్గదర్శి వవ్వాలీ.. !! 
           " నిన్నలోనే...... ! "
    ********
కామెంట్‌లు