చిత్రకవిత;- సత్యవాణి
 కనుమ శ్రమజీవులపండగ
మనుషులుకేకాదు శ్రమ
మానవ జీవన వికాసానికిై
తోడ్పడే  జీవులు పడేదీ శ్రమే
మన జీవనాధారమైన
ఆహార సముపార్జనకు
శ్రమించే పశులపండగ యిది
తమ శ్రమకు ఖరీదుకట్టే
షరాబులు లేరని ఏనాడూ వగవని పశువులకొరకు మనుషులు చేసే పండగ యిది
చేరెడు పసుపురాసి
చిటికెడు కుంకుమ బొట్టుపెట్టి కృతజ్ఞతతో
వాటి వెన్నునిమిరే పండుగ కనుము
మనిషి బుధ్ధిజీవి  తనజీవన యానానికి
సహాయపడే జంతువులపట్ల  మనిషి తన
కృతజ్ఞత తెలియజెప్పేపండుగ కనుము
వృత్తి ఏది చేపట్టినా
ఉత్పాదన ఎందుండి రాబట్టినా
చాకలిబండైనా
మంగలిపొదిఅయినా
కత్తి సుత్తులైనా
పారలు పలుగులైనా
కుట్టుయంత్రంనుండి
పట్టునేసే యంత్రంవరకూ
అన్నింటి ఎడలా కృతజ్ఙత తెలుపుకొనే పండుగ ఈ కనుమపండగ
భుక్తినొసగేదేదైనా
దానిపట్ల భక్తిని ప్రదర్శించే పండగ ఈ కనుముపండగ
తొక్కే సైకిలునుండి
తొందరగా గమ్యంచేర్చే
వాహనాలవరకూ
అన్నింటిపట్లా
కృతజ్ఞత తెలుపుకొనేపండగ  కనుమపండగ
              

కామెంట్‌లు