మార్జాల కిశోర న్యాయం-పిల్లి తన పిల్లల్ని ఒకచోట ఉంచుతుంది. వాటికి ఇబ్బంది కలిగితే అవి అరుస్తాయి. వెంటనే తన పిల్లల్ని జారిపోకుండా, పంటిగాటు తగలకుండా సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తుంది. (దీన్ని బట్టి ఇతరాథార మార్గానికి ఉదాహరణగా చెబుతారు. తన బాధ్యతను తాను వహించక ఇతరులపై ఆధారపడటాన్ని సూచించే న్యాయం). దీన్ని వేదాంతంలో భక్తి మార్గానికి ఉదాహరణగా చెప్తారు.
2. స్తాలీ పులాక న్యాయం-బియ్యమంతా పట్టి చూడకుండా, ఒక్క మెతుకు పట్టి చూస్తే అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది. (అలాగే ఒక వ్యక్తిని సాధారణంగా ఒక సందర్భంలో గమనిస్తే తక్కిన విషయాల్లోనూ అతని స్వభావం అర్థమవుతుంది).
3. జలకాష్ట న్యాయం-జల ప్రవాహంలో విడివిడిగా కొట్టుకుపోయే కట్టెలు కాసేపు కలసి ప్రయాణిస్తాయి. మధ్యలో కొండా లేదా గుట్ట అడ్డు వస్తే విడిపోయి తిరిగి నీళ్లు కలవడం చేత కలుస్తాయి. దీన్ని జలకాష్ట న్యాయం అంటారు. అంటే యాదృచ్ఛికంగా కలిసి, మారాలా విడిపోవడానికి ఇది సూచిస్తుంది.
సంస్కృత న్యాయాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి