ఒక్కసారి కనిపించవా నేతాజీ,
నిన్ను చూడాలని చిన్న కోరిక నాకు.
తెలిసినది నీవు,నీవు కాదు,నువ్వు ఒక గొప్ప
వ్యక్తివి,మహోన్నతుడవు త్యాగమూర్తివి!!!
నీవు నీకై బ్రతకలేదు దేశం కోసం
దేశ ప్రగతి కోసం బానిసత్వ సంకెళ్లు
ఛేదించడం కోసం ఎన్ని కష్ట నష్టాలు కోర్చి ఎన్నెన్ని బాధలు పడి,దృఢ చిత్తంతో పోరాటంతో గెలవాలని ఉద్దేశంతో ప్రయత్నించావు కానీ కొందరు వద్దన్నారు.ఏది ఏమైనా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి, సైన్యాన్ని ఏర్పరిచి పోరాడేవు!!
కొండంత ధైర్యంతో నీవు నమ్మిన నిజం నమ్ముకున్నావు అందుకే నీవు యువతకు స్ఫూర్తివైనావు!!
అందుకే జై హింద్ నినాదం నినదించావు నీ సందేశమే పదండి పదండి ఢిల్లీకి!!!
ఎలా మరువగలం,మహావీర నీ ధైర్యసాహసాలు,నీ త్యాగనిరతులు
అందుకే నీవు శాశ్వతం మా అందరి
హృదయాలలో నిండిపోయావ్.
మా నేతలకు నేతవు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి