సుప్రభాత కవిత ; -బృంద
గగనమంతా వెలుగు పంట
భువనమంతా  వెలుతురంట
నేలతల్లికి సంబరమంట

మిత్రుని చూచే తొందరట
రేకులు విచ్చే కోరికట
పూలకు పిచ్చి ఆత్రమట

మబ్బులకేమో పండగట
బంగరు వెలుగుల పొంగెనట
పల్లకి సిద్ధం చేసెనట

గిరులేమో భక్తిగ వందనమట
తరులేమో ఆసక్తిగ చూచెనట
ప్రకృతి  మొత్తం పూచెనట

జగతిని కాచే వెలుగుల దీపం
వేయిరేకుల పుత్తడి పుష్పం
అందంగా తోచె భానుడి రూపం

మురిపించే మనోహర దృశ్యం 
మరిపించే కలతలు సర్వం
పలికించే భావనల సితార గానం

అరుణోదయ  ప్రభాతవేళ
మనసుపాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు