సాకీ:
ఓ క్రాంతదర్శి...
ఓ ఆదర్శమూర్తి...
ఓ సమర స్ఫూర్తి
ఓ జ్ఞాన దీప్తి...
ఓ సంఘ సంస్కారిణి...
ఓ మహిళా శిరోమణి...
పల్లవి:
వందనాలు చదువులమ్మకు
అభివందనాలు సావిత్రమ్మకు
చరణం:1
సమసమాజ స్థాపనకై ఉద్యమించారు
సమతా మమతలు పంచ నిత్యం
పరితపించారు
బాలికల విద్యకై ఎంతో పరిశ్రమించారు
ఛాoదస భావాలపై చండ్ర నిప్పులే చెరిగారు
చరణం:2
'మహాత్మా' జ్యోతీరావు పూలే సహచరివైనావు
జాతిని జాగృత పరచే విద్యా జ్యోతివైనావు
భారత తొలిమహిళా గురువై ఘనత కెక్కినావు
ఆధునిక మహా భారతాన్ని తిరగరాసినావు
'క్రాంతి దర్శి' సావిత్రి బాయి పూలే 192వ జయంతి సందర్భంగా రాసిన పాట.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి