కందం:
*మును స్నానము సేయక చం*
*దనందులదుట యనుచితం; బుదక యుత వస్త్రం*
*బును విదలుంచుట కూడదు*
*మనమున నివి తెలిసి మనుము మహిని కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద ఉన్న వారు, స్నానము చేయకుండా గంధం ఒంటికి రాసుకోవడం మంచి లక్షణం కాదు. నీళ్ళతో తడిసి, నీరు కారుతున్న బట్టను వదిలించకూడదు. ఈ రెండు అలవాట్లు మంచివి కావు అని తెలుసుకుని, మనసులో కూడా నమ్మి నడుచుకో......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మొదటి నుండి కూడా మన పెద్దలు, మన సంస్కృతి మనకు చెపుతున్న విషయాలే, ఇక్కడ కవి మాట్లాడారు. ఉదయం సూర్యోదయం నకు ముందే నిద్ర లేచి, ఆ రోజు వెలుతురు చూసే అవకాశం ఇచ్చిన పరమాత్మకు ధన్యవాదాలతో కూడిన నమస్కారం చేస్తూ, మన పాదాలు ఆ రోజు భూమిని తాకుతున్నాయి అని, అందుకు మన్నించమని, భూమతని ప్రార్ధించాలి. తరువాత, త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు తడిసిన బట్టలను విదిలించ కూడదు. ఎందుకు అంటే, అలా విదిలించడం వలన, మన ఒంటి మీది నీరు, బట్ట ద్వారా ఆ ప్రదేశంలో ఉన్నవారి పైన పడతాయి. ఇది మంచి పని కాదు. అలాగే, సెంటు, అత్తరులు పూసుకున్నంత మాత్రాన భగవంతునికి నమస్కారం చేసే అర్హత మనకు లభించదు. మన పద్ధతి మనది కాదు. సంస్కారయుతంగా వ్యవహరించే బుద్ధిని పరతాత్పరుడు మనకు కలిగించాలని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి