అగస్త్యుడు: అగస్త్యునికి ఉపనయనాది సంస్కారములు దేవతలే చేశారు. విదర్భరాజ కుమార్తె లోపాముద్రను వివాహం చేసుకున్నాడు. అంతేకాక'కవేరా కన్య'ను కూడా వివాహం చేసుకున్నాడు. రామ రావణ యుద్ధ సమయంలో రావణుని పై రామ విజయం కోసం రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు.
వశిష్ఠుడు: వశిష్టుని భార్య అరుంధతి. వీరి ఇరువురు వారి యొక్క తపస్సు పాతివ్రత్యముల చేత లోకంలో గొప్పఖ్యాతి గడించిన దంపతులు. ఈయన బ్రహ్మచే కుల గురువు. వశిష్టుని వంశంలోని వారు పరాశరుడు, సుక మహర్షి , వ్యాసుడు మొదలగువారు. వశిష్టుడు సాక్షాత్తు అగ్ని స్వరూపమే.
విశ్వామిత్రుడు: జన్మతః క్షత్రియుడు. వశిష్టనితో కలహించి ద్వేషముతో తపస్సు చేసి రాజర్షి అయ్యి తరువాత మహర్షి అయి చివరకు బ్రహ్మర్షి అయినా గొప్ప వ్యక్తి విశ్వామిత్రుడు. కుశ నాభుని కుమారుడు'గాధి'ఆయన కుమారుడు విశ్వామిత్రుడు. ఈయనకు బ్రహ్మర్షి అయ్యే నిమిత్తం తపస్సు చేస్తూ ఉండగా మేనకతో కలయిక జరిగి శకుంతల అనే కుమార్తె కలిగింది. అలాగే త్రిశంకు స్వర్గం నిర్మాణం చేశాడు. రామలక్ష్మణులను తన వెంట అరణ్యములకు తీసుకొని పోయి సర్వ అస్త్ర శాస్త్ర సంపదను బోధించాడు.
ఋషులు వివరములు.2;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి