ఒక పర్యాయం గురువుగారు బాలమురళి మద్రాసులోని మహతి వారి గృహానికి వెళ్లి మాట్లాడుతూ తిరిగి వచ్చేటప్పుడు మీ ఫోటో ఒకటి ఇవ్వండి అని అడిగితే గురువుగారు నాకు ఫోటోలు మీద అంత శ్రద్ధ లేదు అమ్మాయి అమ్మాజీ ఫ్రేమ్ కట్టించిన చిన్న ఫోటో ఉంది అని లోపల నుంచి తీసుకు వచ్చి గురువుగారు నా చేతిలో పెట్టారు. దానిని తీసుకొని గురువుగారి ఫోటోను మా కుల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఛాయా చిత్రం కింద మురళి గారి ఛాయాచిత్రాన్ని వుంచి వారిని భగవత్ స్వరూపంగా ఎంచేవాళ్ళం కుటుంబ సభ్యులందరూ కూడా మురళి గారి అభిమానులు ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు కచేరి అయిపోయిన తర్వాత భోజనానికి ఆహ్వానిస్తే అమ్మాయి చేతి వంట తిని తీరవలసినదే అని తన ప్రక్కన ఉన్న అభయం గారిని కూడా తీసుకొచ్చి అరుణ గారి చేతి వంట రుచి చూశారు నేను వచ్చిన ప్రతిసారి నీ చేతి వంట తింటాను నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు కూడా. బాల మురళీకృష్ణ గారి సంగీత సభ జరుగుతున్న సందర్భంగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరికీ తెలియకుండా ఎవరికీ కనిపించకుండా చివరలో కూర్చున్నారు. మురళి గారు సంగీత సభ చాలా ఆనందంగా సాగుతోంది ఆయన ఎన్నిక చేసిన కీర్తనల క్రమం కూడా ప్రేక్షకులకు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రక్కన అభయంగారు (వీరు మలయాళీ) భారతదేశంలోనే మంచి పేరు సంపాదించుకున్న నాట్య కోవిదురాలు బాల మురళి గారు ఆమెకు నచ్చిన గాయకుడు ఎప్పుడూ వారి పక్కనే ఉంటుంది ఆమె తంబర వాయిస్తూ ఉంటే అన్నవరపు రామస్వామి గారు వయొలిన్ దండమూడి రామ్మోహన్ రావు గారు మృగంగం మీద సహకరించారు కచేరి చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుగుతోంది.
మురళి గారికి రామ నీ సమాన మెవరుగా అన్న త్యాగరాజ స్వామి కీర్తన పైన మక్కువ ఎక్కువ దానిని ప్రధాన కీర్తన గా ఎన్నుకొని దాని స్వర కల్పన చేస్తున్న సందర్భంగా అరే నువ్వు పాడటం ఆఫ్ చేయరా అనగానే సభా సదులందరికీ ఆశ్చర్యం వేసింది అంతవరకు బాలమురళి గారి సభను ఆపమన్న వ్యక్తి ఎవరూ లేరు. వీరి మాట వినగానే ఒరేయ్ నువ్వు అంత అనుభూతితో పాడుతూ ఉంటే నాలాంటి సున్నిత మనస్కులు భరించగలరా నేను తట్టుకోలేక పోతున్నాను కాసేపు ఆపరా అని ఆయన చెప్పడం మురళి గారికి కళ్ళ వెంట నీరు తెప్పించింది. వేదిక పైనుంచి వచ్చి విశ్వనాథ వారికి పాదాభివందనం చేసి గురువుగారు మీరు నా సంగీత సభకు రావడం నా అదృష్టం జ్ఞాన పీఠ బహుమతి ని మించిన మీ పొగడ్తలు నా జీవితంలో మర్చిపోలేను అనేసరికి మురళి గారిని లేవ దీసి కౌగిలించుకొని నీ సంగీతం జగద్విఖ్యాతిగాంచుతుంది అని దీవిస్తే ప్రేక్షకులందరూ మహదానందంతో కరతాళ ధ్వనులతో అభినందించారు అలాంటి రసికులు విశ్వనాథ వారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి