బురద నీరు; - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం949281132-2.
 ప్రతి చిన్న పిల్లవాడికి కూడా వచ్చిన విషయం మనకు వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు  కాలువలు అన్నీ మట్టిమయం. ఎర్రగా వున్న మట్టితో కలిసి వస్తూ ఉంటుంది. ఈ మట్టిలో  కాలుష్యంతో కూడిన మురికి నీరు కూడా దాని జతగా  ప్రవహిస్తూ ఉంటుంది. ఏ పల్లెటూరులో చూసిన  ప్రతి కుటుంబం ఆ కాలువ నీరు తెచ్చుకొని  కుండలో పోసి  కదపకుండా అలా నిశ్చలంగా గంటల తరబడి ఉంచుతారు  ఈ సమయంలో బురద అడుగున చేరుకుంటుంది  ఆ పై ఉన్న శుభ్రమైన నీటిని  వీరే పాత్రలో పోసి వాడుకుంటూ ఉంటారు. ఇది ప్రతి కుటుంబంలో జరిగే విషయం.  కొంతమంది ఆటవికులు మనం   కోయ వాళ్ళు అని పిలుస్తాం. వారొచ్చి చేతులు చూసి వీరి జాతకాలు చెప్పి డబ్బులు వసూలు చేసుకుని తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. వారి వద్ద చిల్లగింజలు దొరుకుతాయి  ఈ గింజ ప్రత్యేకత ఏమిటంటే  బురద నీటిలో ఉండడం కుండ లోపల దీనిని అరగదీస్తుంటే  ఆ కుండలో ఉన్న మురికి మొత్తం అడుగున చేరుతుంది  అందువల్ల ఈ కుండ జాతి వారి దగ్గర డబ్బులు ఇచ్చి ఆజ్ఞలను కొంటారు  ఇలాంటి అవసరాలకు అది పనికి వస్తుంది  ఆ విషయాన్ని ఉదాహరణగా తీసుకొని  వేమన అద్భుతమైన  ఆటవెలదిని మనకు అందించారు  ఈ శరీరం ఆ బురదతో నిండిన  కొండ లాంటిది  దానినిండా మురికి నీరు ఉంటుంది  నిజమైన గురువు  చిల్లగింజ లాంటివాడు  ఆ కుండ నీటిని చిల్లగించ ఎలా శుభ్రపరుస్తుందో అలా అపవిత్రంగా ఉన్న మనసును  చికాకులతో బాధలతో నిండి ఉన్న మనసును  చిల్లగింజ  లాంటి గురువు మకిలిని పోగొడతాడు. ఎప్పుడు ఆత్మ కలుష ఆలోచనలతో  అపవిత్రతతో నిండివున్నదో  అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి  మూల సిద్ధాంతం అతని మనసుకు పట్టేట్లుగా  గురువు హితబోధ చేసినప్పుడు  తప్పకుండా ఆ మనసు  పాప పంకిలం నుంచి బయటపడుతుంది  అక్కడ దేనివల్ల చెడిపోయినదో  ఆ మనసు మూలాన్ని తెలుసుకునే  మంత్రం గురువుగారికి తప్ప మరొకరికి తెలియదు  సరియైన జబ్బుకు సరియైన చికిత్స చేయాలి అన్న పద్ధతిలో అజ్ఞాన తిమ్మిరాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానిని  విజ్ఞానిగా చేసే మంత్రం ఆ ఒక్క గురువుకు మాత్రమే ఉంది  దివ్యామృతాన్ని ప్రసాదించగలిగిన ఏకైక వ్యక్తి గురువు  ఆ సిద్ది పొందిన ప్రతి శిష్యుడు ధన్యోత్ముడు  ఆ పద్యం చదవండి.

"గురువు చిల్లగింజ కుంభమీ దేహంభూ  
ఆత్మ కలుష బంకమడుగు బట్ట తెలిసి విరచలేని దివ్యమృతము తేరు..."



కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం