బిత్తరి తత్త్వం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ఏ మనిషి అయినా  ప్రస్తుతం తను జీవిస్తున్న పద్ధతిని మించి హాయిగా ఆనందంగా, ఆడంబరంగా తిరగాలని ఉంటుంది  ప్రత్యేకించి వేషం పుట్టిన క్షణం నుంచి తల్లి అతని మానాన్ని కాపాడుతూ  శరీరాన్ని కప్పుతుంది. అతనికి వయసు పెరుగుతున్న కొలది శరీరానికి కావలసిన దుస్తులను  అవసరార్థం మాత్రమే కాక  చూసేవారికి ఆకర్షణేయంగా ఉండాలని కోరిక కలుగుతుంది  ఆ కోరిక రకరకాల రుచులకు అలవాటు పడి అవతల వాడు ధరించిన దానికన్నా  మరికొంత  అందంగా ఉండాలని తనను చూడగానే ప్రతి ఒక్కరు  తన వస్త్రధారణను మెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. అదే స్త్రీలైతే  మరికొంత ఆకర్షణీయంగా ఉండాలని  కొత్త కొత్త రంగులు రకరకాల రంగుల కలయికతో ముస్తాబు అవుతూ ఉంటారు.
కానీ ప్రతి ఒక్కరూ  పుట్టినప్పుడు బట్టలు లేవు  మరణించేటప్పుడు బట్టలు  లేవు అన్న  విషయాన్ని విస్మరించి  కొత్త పోకడలను  పోవడానికి ప్రయత్నిస్తారు.  ఇంత క్రితం వేమన మరొక పద్యంలో  కట్టబట్టలేదు అన్న పద్యంలో  దీనిని వివరించారు  ఈ వస్త్రధారణ  మూడు రకాల వ్యక్తులకు సమన్వయ పరుస్తూ  చేసిన ప్రయోగం. కొంతమంది  వీధులలో భిక్షాటన చేస్తూ  నగ్నంగా తిరుగుతూ ఉంటారు  ప్రత్యేకించి ఒక రకం స్త్రీలు కూడా  వాటిని చూసినవారు  వారికి బట్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన  వాడు ధరించడానికి అంగీకరించడు చూసినవారు దయదలచి  వారికి  వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహాయం చేస్తూ ఉంటారు.  చివరిగా మరొక వ్యక్తిని గురించి చెప్తున్నారు వేమన
మానవ శరీరానికి కావలసిన  భోగములన్నిటిని  విసర్జించి  తన జీవిత గమ్యం కోసం  ప్రయత్నం చేస్తూ  తన శరీరానికి ఏమాత్రము ప్రాధాన్యత లేకుండా  మనకున్న మూడు కాలాలలోనూ  ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణికిపోతూ  తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అతను వస్త్రధారణ చేశాడో లేదో  దిగంబరంగా ఉన్నాడా  లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన పద్ధతిలో దీక్షగా  కార్యనిర్వహణ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ మూడు రకాల తత్వాలను అందంగా  అక్షరాలతో కూర్చి చక్కటి ఆటవెలదిలో సామాన్య ప్రజలకు కూడా అంది అర్థం అయ్యేజన భాషలో వేమన పద్యాలు మనకు  చదవగానే  అంతరార్ధాలను కూడా తెలుసుకోగలిగిన  వ్యక్తీకరణ ఆయన శైలిలో ఉంది  ఆ పద్యాన్ని చదివితే మీకే తెలుస్తుంది.

"పుట్టు బిత్తలి వలెపోవు  బిత్తలి వలె తిరుగు  
బిత్తలి వలె దేహి ధరణి యున్నవాటికైననుపకారిగాలేడు..."

కామెంట్‌లు