న్యాయాలు -43
కూప ఖనన న్యాయము
******
కూపము అంటే బావి.ఖననం అంటే త్రవ్వుట లేదా పాతి పెట్టుట.
అంటే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా నివారణ చర్యలు చేపట్టే వారిని ఉదహరిస్తూ పెద్దలు ఈ కూప ఖనన న్యాయమును చెబుతుంటారు.
అప్పటి వరకు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా,ఏమీ పట్టించుకోకుండా ఉండి తీరా ఇబ్బంది కరమైన పరిస్థితి తన దాకా వచ్చినప్పుడు హడావుడి పడుతూ, అల్లాడి పోతుంటారు. ఉన్న అవకాశాలన్నీ చేజార్చుకుని తర్వాత విచారించే వారిని ఉద్దేశించి ఈ కూప ఖనన న్యాయము చెప్పబడింది.
"దాహమైనప్పుడే బావి త్రవ్వుకున్నట్లు","చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు", "కొంపలంటుకున్న తర్వాత నూతిని త్రవ్వడం మొదలు పెట్టినట్లు" లాంటి సామెతలన్నీ ఈ కోవకు చెందినవే.
ఓ గుడిలో పూజారి అందరికీ అప్పుడే తయారు చేసిన వేడి వేడి పాయసం వచ్చిన భక్తులకు పెడుతూ ఉన్నాడు.అందరూ ఆ గుడి ఆవరణలో ఉన్న బాదం చెట్టు ఆకులను కోసుకుని అందులో పెట్టించుకొని తింటున్నారు. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆకు లేకుండా ప్రసాదం కోసం చేయి చాపాడు.అప్పటికీ పూజారి చెప్పాడు ' చేయి కాలుతుంది.ఆకు తెచ్చుకో ' అని. కానీ అందరికంటే భిన్నంగా ఉండాలనీ తాను చేతిలో పెట్టుకునే తింటానని పెట్టమంటాడు.
సరేనని పూజారి వేడి ప్రసాదాన్ని చేతిలో పెడతాడు. ఆ వేడికి చేయి కాలి విలవిల్లాడుతూ గబగబా వెళ్ళి ఆకులు తెచ్చుకుని ఆ పాయసం అందులోకి పెట్టుకుంటాడు.
అది చూసిన పూజారి "చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే నాయనా! ముందే నేను చెప్పినట్టు వింటే చెయ్యి కాలేది కాదు కదా " అంటాడు.
భోజనం చేసేటప్పుడు తప్పని సరిగా మంచి నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి.ఒకో సారి తినే ముద్ద గొంతుకు అడ్డం పడి ప్రాణం పోయేంతగా ఇబ్బంది పెడుతుంది.
అప్పుడు లేచి వెళ్ళి గ్లాసు నీళ్ళు వెతుక్కుని తెచ్చుకునే లోపే ఒక్కో సారి ప్రమాదం జరగొచ్చు. దాహమైనప్పుడే బావి తవ్వడం అంటే ఇలాంటిదే.
అలాంటి సంఘటనలు, సందర్భాల నుండే ఇలాంటి సామెతలు, న్యాయాలు పుడుతూ ఉంటాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి