సైన్స్ టీచర్ పాఠంచెప్తూ అడిగిన ప్రశ్న "పిల్లలూ! ఇప్పుడు అందరికీ సర్వసాధారణంగా మారిన రోగాలు ఏంటీ?" "బి.పి. షుగర్ టీచర్!" అంతా అరిచారు. "గుడ్!మాచిన్నప్పుడు బియ్యపు పరమాన్నం ని బి.పి.అని పిల్చేవారం.ఎక్కువ ఒత్తిడి అలసట శ్రమతో అనవసరపు ఆలోచనలతో 30ఏళ్ళకే బి.పి.షుగర్! ఒకసారి బి.పి.వస్తే ఇక జీవితాంతం వేసుకోవాలి. తగ్గిందని ఆపకూడదు." "అవును టీచర్! మాఅమ్మ కి 35ఏళ్ళ కే బి.పి.వచ్చింది. మాతాతకి 70.ఐనా బి.పి.షుగర్ లేదు." పిల్లల వ్యాఖ్యలు వింటూ టీచర్ ఓ కొత్త విషయం చెప్పారు " మనకు చేతనైనంత చిన్న సాయం చేస్తూ పోతే బి.పి.తగ్గుతుంది. శరీరం మెదడు పరోపకార భావనలతోహ్యాపీ హార్మోన్లని విడుదల చేస్తాయి.రిసెర్చ్ చేసి కనుగొన్నారు. ఒకగ్రూప్ వారికి కొంత డబ్బు ఇచ్చి మీకోసం ఖర్చు పెట్టుకోమన్నారు.రెండో గ్రూప్ వారికి అంతే డబ్బు ఇచ్చి "ఇతరులకోసం ఖర్చు చేయండి అన్నారు. మూడో గ్రూపు వారిని ఏదో కొత్త పని మాటసాయం చేయమన్నారు.2-3గ్రూపులవారు బి.పి.తగ్గి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. తమకోసం డబ్బు స్వార్ధం తో వాడుకున్నవారి బి.పి.అలాగే ఉంది. మంచిమాటలు ఆప్యాయంగా పలకరించడం ఇంటికి పోస్ట్మాన్ వస్తే మంచి నీరు ఇవ్వడం దారి అడ్రస్ తెలీని వారికి చెప్పి వివరించటం చేస్తే చాలు.మనకు తృప్తి ఆనందం "
టీచర్ మాటలు నిజంగా ముత్యాల మూటలు కదూ?🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి