💚 "ప్రేమలేఖ" పంపుట
వలననే ప్రేమికులు
జంటలగు చున్నారు!
ఓ తెలుగు యువత!
💚 "ప్రేమలేక" పోవుట
వలననే దంపతులు
విడిపోవు చున్నారు!
ఓ తెలుగు యువత!
(తెలుగు యువత పదాలు., శంకర ప్రియ.,)
💛ప్రేమ.. నిష్కామ మైనది! ప్రేమ.. అమర మైనది! ప్రేమ.. నిత్య మైనది! ప్రేమ.. స్వచ్ఛ మైనది! ప్రేమికులకు.. చూపులు కలిసిన శుభవేళ.. ఒక ప్రేమలేఖ! వారికది.. మధురానుభూతిని కలిగించుతుంది! అది.. ఏడు అడుగుల అనుబంధంతో; దాంపత్యబంధ మవుతుంది!
💚రెండు అక్షరముల "ప్రేమ".. రెండు క్షణముల "ప్రేమ" కారాదు! యువతీ యువకులకు.. రెండు కన్నులు చూచేది..శరీరఆకర్షణ! రెండు పెదవులు చెప్పేది.. దేహస్పర్శ మాత్రమే! అందువలన, ఆలుమగలు మధ్య "ప్రేమ లేక" పోవడంవలన; దాంపత్య బంధం విచ్ఛిన్నమగు చున్నది!ఆ భార్యా భర్తలు విడిపోయి; విడాకులకు కారణమగు చున్నది!
🤍"కా ఇత్యేకాక్షరం కాపురం, లేదా కామం!" అనెడు, ఆర్యోక్తి ప్రకారం.. "కామము" అనగా ఐహిక వాంఛ! అది.. తీరనంతవరకు; "ప్రేమే".. మహాప్రాణం! ఆ కోరిక.. తీరినాక; అదే.. అల్పప్రాణం!
"కాపురం"అనగా, ఆలుమగలు .. దాంపత్య బంధముతో, ప్రేమానురాగములతో కలిసిమెలిసి జీవించాలి! కనుక, స్త్రీపురుషులార! "పాలు తేనెలు"వలె; దంపతులు సహజీవనం కొనసాగించాలి!
శివమస్తు! శ్రీరస్తు!
( విడాకులకై లాయరు వద్దకు పరుగెత్తిన ప్రేమ జంట; పేర్కొనిన సమాధానము.. ఒకసారి పరిశీలించండి! )
🚩 తేట గీతి 🚩
"ప్రేమ లేఖ" అనిన దంట, ప్రేమజంట!
ఇపుడు విడిపోవు నుద్దేశ్య మేమి టనిన
"ప్రేమ లేక" అనిన దంట ప్రేమజంట!
( డా.వెలుదండ సత్యనారాయణ., పరమార్థ కవి., )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి