బ్రహ్మ, నారద సంవాదంలో.....
తారకాసురుని కుమారులు - తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు - దేవతలు బ్రహ్మ తో మొర - శివుని దగ్గరకు వెళ్ళటం - విష్ణువు దైత్యులను మోహింప చేయడం - ఆచార భ్రష్టులను చేయడం..
*నారదా! తారకాసురుని కుమారులు, తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు. వీరు జన్మతః అమిత బల సంపన్నులు, అమేయమైన యుద్ధ కౌశలం గలవారు. వీరికి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణేశ పూజల వలన వచ్చిన దైవ శక్తి తోడైంది. వారి ముగ్గురి దివ్య పట్టణములు అభేద్యములుగా నిర్మింప బడినాయి. ఇన్ని విధాలా బలవంతులైన వీరి ప్రభకు అడ్డేది ఎవరు. అప్రతిహతంగా, ముగ్గురు దైత్యులూ, మూడు లోకాల మీద దండ యాత్ర చేస్తూ, ఇంద్రుడు మిగిలిన దేవతలను కూడా వెంటాడి ఓడించారు. మునులు, ఋషులు, యాగ క్రియ సరిగ్గా చేసుకోలేక పోతున్నారు. యజ్ఞ భాగాలను కూడా ఆయా దేవతలకు దొరకకుండా, తారకాసురుని కుమారులు తీసుకుంటున్నారు. ఈ మితి మీరిన ఆగడాలను భరించలేక, ఇంద్రాది దేవతలు, బ్రహ్మను చేరి, "ధాతా! ఈ తారకాసురుని కుమారుల నుండి మమ్మల్ని, ఈ మూడు లోకాలను రక్షించు" అని అడిగారు.*
*దేవతా సమూహం చేసిన ఆక్రందనతో కూడిన ప్రార్థన విన్న బ్రహ్మ, "నాయనలారా! ఆ తారకాసుర కుమారులకు నేనే వరములు ఇచ్చాను. కనుక, నేను వారిని నిలువరించడం గానీ, సంహరించడం గానీ కుదరని పని. అందువలన, మీరు అందరూ ఆద్యంతరహితుడు అయిన వృషభవాహనుని చేరి, ప్రార్థన చేయండి. ఆ ఈశానుడే ఈ పనికి తగినవాడు." అని శాంత పరుస్తాడు. బ్రహ్మ తో కలసి, దేవతలు, మునులు, ఋషులు అందరూ కైలాసపతిని చేరి అనేక విధాల ప్రార్థిస్తారు. ఆర్తితో కూడిన వారి ప్రార్థన విన్న శంకరుడు, "దేవతలారా! మీకు వచ్చిన కష్టాలు అన్నీ నాకు తెలుసు. మీరు ఆ తారకాసురుని కుమారుల అంతం కోరుకుంటున్నారు అని కూడా తెలుసు. కానీ, తారకాసురుని కుమారులు, తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు, వారి మూడు భువనాలలో ఉన వారు అందరూ కూడా ప్రతీ నిత్యం బ్రహ్మ, విష్ణు, శివ, గణేశ పూజలు, యజ్ఞ యాగాదులు చేస్తూ, జాతి, కుల ధర్మాలు పాటిస్తూ, స్త్రీలు ధర్మ పరాయణులుగా, పతివ్రతలుగా ఉంటూ సుఖ జీవనం చేస్తున్నారు. వారందరూ నాపై అమితమైన భక్తిని కలిగి ఉన్నారు. నా భక్తులను నేను చంపలేను కదా! ఇది మీకు తెలిసిన విషయమే. త్రిపురాలలో ఉన్న వారందరూ, తారకాసురుని కుమారులతో సహా ధర్మ భ్రష్టులు అయితే తప్ప వారి సంహారం కుదరదు. అందువల్ల, మీరు విష్ణువు సహాయం పొంది, ప్రయత్న పూర్వకంగా వారిని ధర్మహీసులను చేయండి. ఆపైన నేను నా పని చేస్తాను" అని అభయం ఇస్తారు.*
*శివుని ఆజ్ఞ పొంది తన వద్దకు వచ్చిన దేవతల కోరిక తెలుసుకుని, విష్ణుమూర్తి త్రిపురాల మీద తన విష్ణు మాయను ప్రయోగిస్తారు. ఆ మాయ ప్రభావంతో, దైత్యలు, పురుషులు, స్త్రీలు, మునులు అందరూ కూడా తమ తమ కర్తవ్యం విడిచిపెట్టి, చేయకూడని పనులు చేయడం మొదలు పెట్టారు. దైవ పూజలు, యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. అరాచకం పెరిగిపోయింది. ప్రజలకు ప్రభువు మీద నమ్మకం సడలి పోయింది. ఒకరిని ఒకరు మోసగించుకోవడం, సంపద దొంగిలించడం, చంపుకోవడం వంటివి నిత్యం జరుగుతున్నాయి. విష్ణు మాయ తన ప్రభావం, తారకాసురుని కుమారుల మీద కూడా చూపింది. వారు కూడా, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, తమ ప్రజలనే చెరపట్టే పరిస్థితి వచ్చింది. అందువల్ల, ముగ్గురు దైత్య రాజుల శక్తి, మయుని శక్తి కూడా తగ్గిపోయింది. "భగవంతుని మాయ నుండి తప్పించుకోవడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు కదా!"*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి