*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0250)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
సర్వదేవమయ రథ వర్ణన - శివుడు యుద్ధమునకు వెళ్ళుట - పశుపతి అని పేరు - గణేశుని పూజ - త్రిపుర దహనము - మయుడు, త్రిపురాసురుని కొడుకులు బయట పడుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయనమః ఓం"*
*నారదా! శంభుని ఆజ్ఞతో, విశ్వకర్మ రుద్రదేవుని స్మరించి, ఎంతో గొప్పది, మహిమాన్వితమైన "సర్వదేవమయ రథం" ను నిర్మించాడు. ఆ సర్వదేవమయ రథము, సూర్యుడు కుడివైపు చక్రముగా 12 మంది సూర్యలతో, ఎడమవైపు చక్రముగా 16 కళలతో చంద్రుడు, 6 ఋతువులూ ఆ చక్రములకు ఇరుసులగా, అంతరిక్షము రథము ముందు భాగంలో, మందరగిరి రథము లో కూర్చునే స్థానముగా ఉండి బంగారు శోభలతో ధగద్ధగాయంగా వెలిగి పోతోంది. ఉదయాచలము, అస్తాచలము రథము నకు ఒగలయవాయ్యాయి. మహామేరువు అధిష్టాన దేవత అయ్యింది. సంవత్సరము అనగా కాలను ఆ రథము నకు వేగం అయ్యింది. ఉత్తరాయణ, దక్షిణాయనాలు లోహధారలుగా, ముహూర్తం తాడుగా, కళలు మేకులుగా, కాష్టములు ముక్కు యొక్క అగ్రభాగముగా అమరాయి. క్షణము అక్షదండముగా, నిముషము ఆ దండమునకు కర్రగా, ద్యులోకము రథము నకు గొడుగుగా, స్వర్గ మోక్షములు పతాకలుగా, ఐరావతం యొక్క భార్య, అభ్రకము, కామధేనువు రెండు కూడా చక్రాలకు పిడులుగా అమరాయి. రథ మద్య భాగంలో బుద్ధి, ఒక మూలగా అహమకారము, పంచభూతములు ఆ రథానికి బలముగా ఉన్నాయి.*
*నారదా! ఆ సర్వదివ్యమయ రథానికి, ఇంద్రియాలు నాలుగు వైపుల నుండి కాపు కాస్తున్నాయి. శ్రద్ధ రథము యొక్క గమనాన్ని నిర్దేశిస్తోంది. వేదాంగములు భూషణములుగా ఉన్నాయి. వేయిపడగల శేషు కట్టుత్రాడుగా ఉన్నాడు. పుష్కరతీర్థాలు పతాకలు అయ్యాయి. గంగా మొదలైన నదులు అన్నీ సర్వాంగ దుదరులు అయిన స్త్రీలుగా వచ్చి చామరములు వీస్తున్నారు. వర్షాచలము పాశముగా ఉన్నది. దేవాధిదేవుడు సృష్టి కర్తను అయిన నేను కళ్ళెము పట్టుకొని సారథిగా, బ్రహ్మదైవత ఓంకారముకొరడాగా, మందరాచలము దండముగా, శైలరాజు హిమవమతుడు ధనస్సుగా, నాగరాజు అయిన శేషుడు అల్లె త్రాడు అయ్యాడు. సరస్వతీ దేవి ఆ ధనస్సుకు ఘంటగా మారింది. నాలుగు వేదములు, రథమును లాగే గుర్ఆలు అయ్యాయి. జ్యోతులు గుర్రములకు ఆభూషణములుగా, విషము నుండి పుట్టిన వస్తవులు సైన్యముగా, వాయువు వాయిద్యాలు గా, మునీద్రలు వాహకులుగా, ఉన్నారు.  ఇన్నివెందుకు, నారదా! బ్రహ్మాండములో ఉండే అన్ని వస్తువులూ ఆ రథములో ఏదో ఒక రూపములో తమ స్థానము పొందాయి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు