కందం:
*గరళము పెట్టెడు వానిని*
*పరు జంప దలంచువాని బనులెల్ల బయ*
*ల్పరచెడివానిం బరధన*
*హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా !*
తా:
కుమారా! ఇతరులకు విషము పెట్టి చంపాలనుకునే వారిని, ఎదుటి వారి ప్రాణాలు తీసి చంపాలి అనుకునే వారిని, రహస్యాలు అన్నిటినీ అందరికీ తెలిసెటట్టు బుటపెట్టే వారిని, ఇతరుల సంపద, డబ్బు దొంగతనం చేసే వారిని, దండనకు గురి చేసి, చంపి రాజ్యాధికారం లో ఉన్న వ్యక్తి, రాజు, పుణ్యమే సంపాదించుకుంటాడు ........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మానవ సమాజంలో, మన చుట్టూ ఉన్న వారి మధ్య, అశాంతిని పెంచే ఎటువంటి పనులు చేసేవారికైనా జీవించే అర్హత ఉండదు. జీవితంలో నలిగి పోయి, బ్రతకడానికి వేరే ఏదారి లేనప్పడు కూడా, దొంగతనం చేయడం సమర్ధనీయం కాదు. కానీ, బ్రతుకుతెరువు కోసం కాబట్టి, కొంత చూసి చూడనట్టుగా వుండొచ్చు. కానీ, దొంగతనం చేయడమే వృత్తి అయితే, ఆవ్యక్తకి వ్యవస్థ మీద, సమాజం మీద గౌరవం లేదు. తన ధన సంపాదన దాహం తీర్చుకోవడానికి, ఎంతటి నీచమైన, హేయమైన వపనిని అయినా చేయడానికి సిద్ధ పడే వారికి, సమాజంలో నలుగురితో కలసి బ్రతికే అవకాశం ఉండదు. ఇటువంటి వారు అందరూ, తమ జీవన విధానాన్ని మార్చుకో లేనప్పుడు, వారికి విధించే మరణ శిక్ష, సమాజానికి మేలే చేస్తుంది. చెడు మార్గంలో వెళ్ళాలి అనుకునే ఎంతో మందికి, హెచ్చరికగా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారిని అందరినీ మంచి మార్గంలో వెళ్ళే వారిగా చేయమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి