*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 074*
 కందం:
*గృహ దాహకునిం బరదా*
*రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో*
*త్సాహపరుని జంపి నరపతి*
*యిహ పరముల యందు కీర్తి నెనగు కుమారా !*
తా:
కుమారా! ఇళ్ళు తగలబెట్టే వానిని, పరాయి వారి భార్యలను సొంతం చేసుకోవాలనుకునే వారిని, తనను కోరుకునే చుట్టాలకు మంచి పనులు చేయాలి అనే ఆలోచనలు చేయని దుష్టులను, చెడ్డ పనులు చేయడం లో అత్యంత ఉత్సాహం చూపించేవారిని చంపిన, రాజ్యాధికారం లో ఉన్న వ్యక్తి, రాజు, ఈ భూలోకంలో నైనా, మరణించిన తరువాత పైలోకంలో అయినా మంచి పేరు, పుణ్యము సంపాదించుకుంటాడు ........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ రోజుల్లో, మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వారిలో, సొంత చుట్టాలకు, రక్త సంబంధీకులకు కూడా నష్టం జరిగేలా చేసి, ఇబ్బందులు కలిగేలా నడచుకునే వారే ఎక్కవగా కనిపిస్తున్నారు. సమాజానికి, సొంత వారికీ ఏవిధంగానూ ఉపయోగపడని ఇటువంటి వ్యక్తులకు జీవించే అర్హత ఉండదు. పరస్త్రీ వ్యామోహం వలన నష్ట పోయిన కౌరవులు, రావణబ్రహ్మ గురించి మనకు తెలుసు. కానీ, తెల్లవారితే, ఎంత మంది రావణులు, కీచకులు,  ధృతరాష్ట్ర పుత్రులూ పుట్టుకు వస్తున్నారో మనం చూస్తున్నాం. ఇటువంటి వారు అందరూ, తమ జీవన విధానాన్ని మార్చుకో లేనప్పుడు, వారికి విధించే మరణ శిక్ష, సమాజానికి మేలే చేస్తుంది. చెడు మార్గంలో వెళ్ళాలి అనుకునే ఎంతో మందికి, హెచ్చరికగా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారిని అందరినీ మంచి మార్గంలో వెళ్ళే వారిగా చేయమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం