కందం:
*తన సత్కర్మాచరణం*
*బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్రా*
*ణుని వర సాహాయ్యముచే*
*ననల బెంతైన బెరుగునయ్య కుమారా !*
తా:
కుమారా! అందరికీ ప్రాణాధారమైన గాలి తగిలినప్పుడు నిప్పు తొందరగా నాలుగు వైపులా వ్యాపిస్తుంది. అలాగే, మంచి పనులు చేయడం వల్ల వచ్చే ఫలితం తో మన సంపదలు ఇంతకు ఇంతగా అభివృద్ధి చెందుతాయి.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*నలుగురి మంచి కోరుకుంటూ, అందరి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకునే వారికి జీవితం గడపడానికి అవసరమైన డబ్బు దస్కంతో పాటు, భగవంతుని దగ్గరగా చూడడానికి అవసరమైన మానసిక సంతోషం కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఎదుటి వారి బాధ చూసి అయ్యో పాపం! ఎంత బాధను, కష్టాన్ని అనుభవిస్తున్నారో! అనుకోగలిగినా, వారికి ఎంతో కొంత సహాయపడు స్వామీ! అని ప్రార్థన చేయగలిగినా మనం మంచి పని చేసినట్టే. ఇలా ఇతరుల గురించి కొంతైనా ఆలోచించ గలిగే మంచి మనసు మన అందరికీ ఇమ్మని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి