కందం:
*ఘన బీజపు సాయము లే*
*కను భూములు నిష్ప్రయోజకంబైన విధం*
*బున దైవము తోడిలఁగా*
*కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా !*
తా:
కుమారా! భూమిని ఎంతో చక్కగా దుక్కి దున్ని విత్తనాలు నాటడానికి సిద్ధం చేసినా, అత్యంత నాణ్యమైన విత్తనాలు నాటక పోతే, పంట పండదు. అలాగే, మానవుడు ఎన్ని విధాలుగా శక్తి వంతుడు అయినా, భగవంతుని తోడు లేకపోతే, ఆ మానవుని శక్తి యుక్తులు వ్యర్ధమే అవుతాయి.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ చరాచర ఐహిక జగత్తులో, మానవులు తలపెట్టిన, ఏ పని సఫలీకృతం అవ్వాలన్నా, భగవత్ కృప, అనుగ్రహం, తోడు కచ్చితంగా అవసరం. ఆ పరమాత్ముని తోడ్పాటు లేని ఏ ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు. మానవ ప్రయత్నం అత్యావశ్యకం. కానీ, మానవుని ప్రయత్నం తోనే కోరుకున్న సత్ఫలితాలు రాబట్టలేరు. గజేంద్ర మోక్షం - తనను నీటిలోకి లాగుతున్న మొసలి నుండి, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, తనని తాను విడిపించుకో లేక పోయాడు, గజరాజు. అలాగే, కురుసభలో, ద్రౌపది. తన మాన రక్షణ కోసం, తను చేసిన ప్రయత్నం, ఏ ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ రెండు సందర్భాలలో కూడా పరమాత్ముని అనుగ్రహం అందిన తరువాత మాత్రమే, అంద వలసిన ఫలితం గజరాజు, ద్రౌపది లకు అందింది. అందువల్ల, మనందరికీ పరమాత్ముని అమేయమైన ప్రేమ ఇబ్బడిముబ్బడిగా ఉండేలా ఈశ్వరానుగ్రహం ఉండాలని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి